కస్తూరి పసుపులో వున్న మేలెంత? (video)

కస్తూరి పసుపులో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కస్తూరి పసుపు మోకాలి నొప్పుల్ని నయం చేస్తుంది. తల భారాన్ని తగ్గిస్తుంది. కస్తూరి పసుపు క్రిములను నశింపజేస్తుంది. మంచి

turmeric
selvi| Last Updated: శుక్రవారం, 10 నవంబరు 2017 (16:13 IST)
కస్తూరి పసుపులో ఆరోగ్యానికి మేలు చేసే గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కస్తూరి పసుపు మోకాలి నొప్పుల్ని నయం చేస్తుంది. తల భారాన్ని తగ్గిస్తుంది. కస్తూరి పసుపు క్రిములను నశింపజేస్తుంది. మంచి వాసనతో కూడిన కస్తూరి పసుపు చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. అవాంఛిత రోమాలను తొలగిస్తుంది. ఊపిరితిత్తుల్లో ఏర్పడే రుగ్మతలను నయం చేస్తుంది.

కస్తూరి పసుపు పావు స్పూన్, రెండు స్పూన్ల పెరుగును పేస్ట్‌లా చేసుకుని ఉదయం, సాయంత్రం పూట పావు స్పూన్ మేర తీసుకుంటే అల్సర్ దూరమవుతుంది. కస్తూరి పసుపు కడుపులో ఏర్పడే ఆమ్లాలను తొలగిస్తుంది. చర్మ వ్యాధులకు చెక్ పెడుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

కస్తూరి పసుపు మహిళల్లో వైట్ డిశ్చార్జ్‌ను దరిచేరనివ్వదు. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తలభారాన్ని తగ్గించుకోవాలంటే పావు స్పూన్ కస్తూరి పసుపు కాసింత నీటిని చేర్చి.. పావు స్పూన్ సున్నం చేర్చి.. నుదుటన పూతలా వేస్తే ఉపశమనం లభిస్తుంది. సున్నాన్ని మాత్రం తక్కువగా ఉపయోగించాలి. కస్తూరి పసుపును ఉపయోగించి మోకాళ్ల నొప్పులకు మందు తయారు చేయొచ్చు. ఓ పాత్రలో ఆముదం పావు కప్పు పోసి వేడి చేయాలి. ఇందులో కస్తూరి పొడిని చేర్చి కలపాలి. ఈ పేస్టును మోకాళ్లకు పూతలా వేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది. వాపు తగ్గుతుంది.

కస్తూరి పసుపుతో సౌందర్యం
కస్తూరి పసుపు పావు కప్పు, రోజా రేకులు అరకప్పు, పాలు.. అరకప్పు తీసుకుని పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్టును వారానికి రెండుసార్లు ముఖానికి పట్టిస్తే.. ముఖంపైనున్న మొండి మచ్చలు తొలగిపోతాయి. మొటిమలు దూరమవుతాయి. ముడతలు తగ్గిపోతాయి. చర్మం ప్రకాశవంతంగా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
దీనిపై మరింత చదవండి :