గురువారం, 14 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 10 నవంబరు 2017 (14:35 IST)

ఆరెంజ్‌తో కొలెస్ట్రాల్ పరార్..

ఆరెంజ్‌లో కొవ్వు శాతం చాలా తక్కువగా వుంటుంది. పీచు వుంటుంది. తద్వారా శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఆరెంజ్‌లో వుండే ఫ్లేవనాయిడ్స్ హృద్రోగానికి మేలు చేస్తాయి. వరుసగా నాలుగు వారాల పాటు ఆరెంజ్ పండును తీసు

ఆరెంజ్‌లో కొవ్వు శాతం చాలా తక్కువగా వుంటుంది. పీచు వుంటుంది. తద్వారా శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఆరెంజ్‌లో వుండే ఫ్లేవనాయిడ్స్ హృద్రోగానికి మేలు చేస్తాయి. వరుసగా నాలుగు వారాల పాటు ఆరెంజ్ పండును తీసుకోవడం ద్వారా రక్తపోటును నియంత్రించుకోవచ్చు.

విటమిన్ సి,  విటమిన్ ఎ అధికంగా వున్న ఆరెంజ్‌ పండును రోజుకొకటి తీసుకోవడం ద్వారా రేచీకటిని దూరం చేసుకోవచ్చు. నారింజ పండు తెల్ల కణాలను ఉత్పత్తి చేయడం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని పీచు అల్సర్‌ను నయం చేస్తుంది. అలాగే క్యాన్సర్‌తో పోరాడుతుంది.
 
నారింజను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా పెద్ద పేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల్లో ఏర్పడే క్యాన్సర్, చర్మ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్లను నియంత్రించవచ్చును. యాంటీ-యాక్సిడెంట్లు పుష్కలంగా వుండే ఆరెంజ్ శరీరంలోని ఫ్రీ-రాడికల్స్‌ను తొలగిస్తుంది. రక్తంలో ఎరుపు రక్తకణాలను.. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. కానీ ఆరెంజ్ పండును పరగడుపున తీసుకోకూడదు. ఆహారం తీసుకున్న తర్వాత ఆరెంజ్‌ను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావు. 
 
ఒక ఆరెంజ్ పండులో వుండే పోషకాలు.. 
కెలోరీ- 47శాతం 
నీటి శాతం- 87 శాతం 
ప్రోటీన్లు -0.9 గ్రాములు 
కార్బోహైడ్రేడ్లు- 11.8 గ్రాములు
పంచదార-9.4 గ్రాములు 
ఒమేగా 6- 0.02 గ్రా.
విటమిన్ ఎ- 11 మి.గ్రా
విటమిన్ సి - 53.2 మి.గ్రా 
విటమిన్ ఈ - 0.18 మి.గ్రా 
థయామిన్ - 0.09 మి.గ్రా,
క్యాల్షియం - 40.మి.గ్రా.
ఐరన్ - 0.1 మి. గ్రా
మెగ్నీషియం - 10 మి. గ్రా,
ఫాస్పరస్ - 14 మి.గ్రా,
పొటాషియం -181 మి.గ్రా.