సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సందీప్
Last Updated : సోమవారం, 1 జులై 2019 (17:47 IST)

ప్రతిరోజూ ఉదయాన్నే వేప ఆకుల రసంతో నోటిని పుక్కిలిస్తే?

ఆయుర్వేదంలో వేపాకుది ప్రత్యేక స్థానం. వేపాకుల వలన ఉన్న ప్రయోజనాల కారణంగానే సబ్బుల తయారీలో, టూత్ పేస్ట్‌ల తయారీలో వేపాకుని ఉపయోగిస్తున్నారు. వేపచెట్టులోని ప్రతి వస్తువు మనకు ఉపయోగపడుతుంది. వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి రక్తాన్ని శుభ్రం చేస్తాయి. 
 
కాలేయం, మూత్రపిండాల నుండి వ్యర్థపదార్థాలను, హానికర పదార్థాలను బయటకు పంపుటకు వేపాకు బాగా సహాయపడుతుంది. ప్రతిరోజూ వేప కషాయాన్ని తీసుకుంటే రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఈ వేప కషాయం తీసుకోవడం వలన రక్తంలోని చక్కెర నిల్వలు, హైబీపీ వంటి సమస్యలు తొలగిపోతాయి. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
 
వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యల నుండి కాపాడుతుంది. తద్వారా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రతిరోజూ ఉదయాన్నే వేప ఆకుల రసాన్ని పుక్కిలించితే దంతాలు బలంగా మారుతాయి.