మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Kowsalya
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (12:29 IST)

వామును వేయించి కాపడంగా పెట్టుకుంటే?

వానాకాలంలో వ్యాధులు చాలా ఎక్కువవుతున్నాయి. అందువలన చల్లటి నీరు, పానీయాలు, తీపి పదార్థాలు, పాల పదార్థాలు, క్రీం బిస్కెట్లు, కేకులు వంటివి తినకూడదు. రాత్రి త్వరగా భోంచేసి మూడు గంటల తరువాత మాత్రమే నిద్రి

వానాకాలంలో వ్యాధులు చాలా ఎక్కువగా వస్తుంటాయి. అందువల్ల చల్లటి నీరు, పానీయాలు, తీపి పదార్థాలు, పాల పదార్థాలు, క్రీం బిస్కెట్లు, కేకులు వంటివి తినకూడదు. రాత్రి త్వరగా భోజనం చేసి మూడు గంటల తరువాత మాత్రమే నిద్రించాలి. ముఖ్యంగా పులుపు వస్తువులను తినడం తగ్గించుకోవాలి.
 
ఇంట్లో బూజు, దుమ్ము, పొగ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా పెంపుడు జంతువులకు దూరంగా ఉండడం మంచిది. నిత్యం ప్రాణాయమాలు చేయడం వలన  ఊపిరితిత్తులు శక్తివంతంగా మారుతాయి. పాలు వేడిచేసుకుని అందులో వెల్లుల్లి మిశ్రమాన్ని కలుపుకుని కాసేపు మరిగించుకోవాలి. ఆ తరువాత పాలను వడగట్టి తీసుకుంటే అనార్యో సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
వామును వేయించుకుని పలుచని వస్త్రంలో మూటకట్టి దానిని ఛాతిమీద కాపడంగా పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆయాసంగా ఉన్నప్పుడు వాముని నల్లగా వేయించుకుని ఆ పొగను పీల్చుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలానే కప్పు నీళ్లలో కొద్దిగా మెంతిపొడి, అల్లం రసం, తేనె కలుపుకుని టీని చేసుకుని తీసుకుంటే కూడా ఆయాసం తగ్గిపోతుంది.