టీ, కాఫీలతో రస్క్ తీసుకుంటున్నారా? కాస్త రిస్కేమో చెక్ చేయండి.. (video)
టీ, కాఫీలు తాగుతున్నారా.. వాటితో పాటు రస్క్ కూడా తీసుకుంటున్నారా... అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. వైట్ బ్రెడ్ లేదా కేక్‌లతో తయారు చేసిన రస్క్‌ల కంటే హోల్-వీట్ రస్క్ మంచి ఎంపిక అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఇది అధిక మొత్తంలో ఫైబర్, ప్రోటీన్‌లను అందిస్తుంది. ఈ రెండూ రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. హోల్-వీట్ రస్క్‌లో మాంగనీస్,సెలీనియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి.
పోషకాహార ప్రయోజనాలను పెంచుకోవడానికి తక్కువ క్యాలరీలు, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పిండిని లేదా మొలకెత్తిన ధాన్యాలతో చేసిన బ్రెడ్‌ని ఉపయోగించి ఇంట్లో రస్క్‌లను తయారు చేసుకోవచ్చు. ఇందులో పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి. తద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
బ్రెడ్, రస్క్‌లు రెండూ శుద్ధి చేసిన పిండితో తయారు చేయబడతాయి. ఇందులో కార్బోహైడ్రేట్‌లలో చాలా ఎక్కువగా ఉంటాయి. కార్బొహైడ్రేడ్లను అధిక మొత్తంలో తింటే శరీర బరువు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్, మెటబాలిక్ సిండ్రోమ్‌లను పెంచుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచేస్తుంది.
టీతో పాటు రస్క్‌లు తినడం వల్ల కలిగే నష్టాలేంటంటే?
అవి పాత రొట్టెతో తయారు చేయబడతాయి
రస్క్ తయారీలో ఉపయోగించే ప్రధాన పదార్థాలు పిండి, చక్కెర, ఈస్ట్, నూనె, మార్కెట్‌లలో లభించే రస్క్‌లో ఎక్కువ భాగం పాతవే. కాలం చెల్లిన రొట్టెతో చేసే రస్క్‌లను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవు. బ్రెడ్‌లో దాని గడువు తేదీకి మించి తినని రొట్టెలో బూజు, విషపూరితమైన పదార్ధం ఉన్నందున, అతిసారం, జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
ఇవి అలెర్జీలతో కూడిన చర్మానికి కారణమవుతుంది. ఇది దురద, వాపుకు కూడా కారణమవుతుంది. ఇందులో వాడే నూనెను కూడా తిరిగి వాడితే అనారోగ్యం తప్పదు.
రస్క్ తయారీలో ఎక్కువగా నూనె నెయ్యి లేదా వనస్పతి రూపంలో ఉంటుంది.
ఇది రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం, గుండెపోటుకు కారణమవుతుంది.