నేరేడు పండును తింటున్నారా? ఐతే గింజల్ని పారేయకండి..

Updated: సోమవారం, 24 జూన్ 2019 (12:11 IST)
నేరేడు పండ్లను తింటున్నారా? ఐతే గింజల్ని పారేయకండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. నేరేడు పండు గింజలు మధుమేహాన్ని నియంత్రించే శక్తిని కలిగివుంటాయని.. ఆ గింజల్ని ఎండబెట్టి పొడి చేసుకుని ఉపయోగించుకుంటే మధుమేహం ఆమడ దూరంలో నిలిచిపోతుందని వారు సూచిస్తున్నారు. 


నేరేడు ఆకులు లేదా గింజల్ని ఎండబెట్టి.. పొడి చేసి రోజూ ఓ టీ స్పూన్ మేర తేనెతో కలిపి తీసుకుంటే మధుమేహంతో ఇబ్బందిపడే వారికే కాదు.. అందరికీ మేలు జరుగుతుంది. 
 
పొడిని నీళ్లలో వేసి మరిగించి కషాయం రూపంలో సేవిస్తే మధుమేహులకి మరీ మంచిది. ముఖ్యంగా గింజల్లోని గ్లైకోసైడ్‌ పిండిపదార్థాల్ని చక్కెరలుగా మారకుండా అడ్డుకుంటుంది. పైగా క్లోమగ్రంథుల నుంచి ఇన్సులిన్‌ స్రావాన్ని పెంచే గుణాలూ ఈ గింజల్లో ఉన్నాయి. ఈ పొడి అతి దాహాన్నీ తగ్గిస్తుంది.


కాబట్టి నేరేడు పండ్లు తిని గింజల్ని పారేయకండి. ఎండబెట్టి పొడి చేసి వాడుకుంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు 
 
ఇక నేరేడు పండు మంచి మౌత్‌ ఫ్రెష్‌నర్‌‌గా పనిచేస్తుంది. చిగుళ్ల వ్యాధులను నివారిస్తుంది. ఇందులో వుండే ఆమ్లాలు జీర్ణక్రియకు తోడ్పడటం ద్వారా కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది.

అన్నీ చూడండి

ఇంట్లోకి చొరబడిన నాగుపామును పోరాడి చంపేసిన బాక్సర్ శునకం

మూడు డిమాండ్లు పరిష్కరిస్తే దీక్ష విరమణకు ఓకే..

ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని

కదులుతున్న రైలులో యువకుడిపై హిజ్రాలు దాడి, అసభ్యంగా చూపిస్తూ వీడియో

మావిగన్ అనేది జగన్ తెచ్చిన కొత్త ఆలోచన కాదు.. చెప్పిందెవరంటే?

అన్నీ చూడండి

Vijay Deverakonda: రౌడీ జనార్థన మూవీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

RC17: రామ్ చరణ్, సుకుమార్ RC17 యాక్షన్ థ్రిల్లర్ గా సిద్ధమవుతోంది !

Varun Tej : కొరియన్ కనకరాజు పాట విడుదలకి భారీ జనసందోహం

ధృవ్ విక్రమ్‌తో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Niharika: తొమ్మిది కోట్ల బడ్జెట్, ఓటీటీ తిరస్కరణ, నెగెటివ్ టాక్.. వెరసి కమిటీ కుర్రోళ్లు కు జాతీయ అవార్డ్

తర్వాతి కథనం
Show comments