మంగళవారం, 12 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (23:43 IST)

మిగిలిన చపాతీలను పారవేస్తున్నారా? (video)

chapathi
chapathi
మిగిలిన చపాతీలు తినకుండా పారవేస్తున్నారా... అయితే ఒక్క క్షణం ఆగండి. ఎందుకంటే పాత రొట్టెలు ఆరోగ్యానికి చాలా మేలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాత రొట్టె తీసుకోవడం వల్ల ఎసిడిటీ, గ్యాస్, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 
 
గోధుమపిండి రోటీని రాత్రిపూట తయారు చేసి ఉదయాన్నే తింటే ఆరోగ్యంపై ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. పాత రొట్టె ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకుందాం.
 
ఉదయం పూట అల్పాహారంగా పాలతో పాత రోటీని తింటే అజీర్ణం, గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. 
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో పాలతో పాత రోటీని తినండి. ఇలా చేయడం వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. 
 
చాలామంది బక్కపలచగా వుంటే పాత రోటీని పాలలో కలుపుకుని తీసుకోండి. ఇది శరీరంలో బలాన్ని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.