శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2024 (15:36 IST)

మొలకెత్తిన రాగులను తింటే మధుమేహం పరార్

Sprouted Ragi
Sprouted Ragi
మొలకెత్తే సమయంలో రాగుల్లో యాంటీఆక్సిడెంట్ల లెవెల్స్‌ పెరుగుతుంది. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి. మొలకెత్తిన రాగుల్లో ప్రోటీన్ పరిమాణం ఎక్కువ. ఇది కండరాల పెరుగుదలకు ఏంతో ముఖ్యమైనది. 
 
మొలకెత్తిన రాగుల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి సంరక్షణలో మేలు చేస్తుంది. చర్మానికి నష్టం కలిగించే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. 
 
ఇవి చర్మ ముడతలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి. రాగుల్లో కార్బోహైడ్రేట్లు, క్యాల్షియం, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తిన రాగులను తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. 
 
జీర్ణక్రియ మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగుపడుతుంది.