1. ఇతరాలు
  2. మహిళ
  3. ఆహారం
Written By
Last Modified: గురువారం, 29 నవంబరు 2018 (15:09 IST)

16 ఏళ్లకే మా అమ్మాయి జుట్టు తెల్లబడిపోతోంది... ఆపగలమా...?

శిరోజాల్లో పిగ్మెంటేషన్ లోపం వల్ల ఇలా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒక్కసారి జుట్టు నల్లరంగును కోల్పోతే, వారసత్వరీత్యా జుట్టు చిన్నతనంలోనే తెల్లబడటం మొదలయినా దానిని నియంత్రించడం కొద్దిగా కష్టమైన పనే. 
 
ఒకవేళ ఇది విటమిన్లు, క్యాల్షియం లోపం వల్ల తలెత్తితే దీనిని మందుల ద్వారా సరిచేసి అవకాశం ఉంది. ఐతే ఈ సప్లిమెంట్లు తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. పాలు, పాల ఉత్పత్తులు, పండ్లు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే గ్రీన్ టీ వంటివాటితో సహా ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటే జుట్టు తెల్లబడటం తగ్గించవచ్చు. 
 
అదేవిధంగా మందార, కరివేపాకు, మెంతులతో తయారు చేసిన మిశ్రమం మంచి హెయిర్ ఆయిల్‌గా పనిచేస్తుంది కనుక దానిని మాడుకు, శిరోజాలకు పట్టించి కొద్దిసేపు ఉంచుకుని కడిగేయాలి.