Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మరసంలో చక్కెర కలిపి ఇలా చేస్తే..?

Updated: శుక్రవారం, 1 మార్చి 2019 (11:09 IST)
నిమ్మ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అదేవిధంగా అందానికి కూడా అంతే మేలు చేస్తుంది. నిమ్మకాయతో ఫేస్‌మాస్క్, స్క్రబ్‌ను ఇంటివద్దనే తయారుచేసుకోచ్చు. నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ వంటి ఖనిజాలు చర్మాన్ని తాజాగా మార్చేలా చేస్తాయి. తరచు నిమ్మతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం..
 
కొబ్బరి నూనె చర్మానికి తేమను అందిస్తుంది. అరకప్పు కొబ్బరి నూనెలో స్పూన్ చక్కెర, స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తరువాత వేడినీళ్లతో కడిగేస్తే ముఖం తాజాగా మెరిసిపోతుంది. పొడిచర్మం ఉన్నవారు ఈ స్క్రబ్ వాడితే ఫలితం ఉంటుంది. 
 
నిమ్మ జిడ్డు చర్మాన్ని తొలగిస్తుంది. సాధారణంగా జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. స్పూన్ నిమ్మరసంలో కొద్దిగా తేనె, వంటసోడా కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంటపాటు అలానే ఉండాలి. ప్యాక్ బాగా ఆరిన తరువాత చల్లని నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా తరచు చేస్తుంటే జిడ్డు చర్మం పోతుంది.
 
నిమ్మకాయలోని విటమిన్ సి చర్మం నిగారింపును మెరుగుపరుస్తుంది. చర్మం మీద మృతుకణాలను తొలగిస్తుంది. పావుకప్పు నిమ్మరసంలో 2 స్పూన్ల చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు రాసుకుని 20 నిమిషాల పాటు అలానే ఉండాలి. ఆపై ముఖాన్ని 2 నిమిషాల పాటు మర్దన చేసి గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు పోతాయి. 

అన్నీ చూడండి

తాళ్లతో బంధించి, కాళ్ల మధ్య కర్రపెట్టి నిందితుడిని గొడ్డును బాదినట్లు బాదారు, ఇదేంటంటూ ప్రశ్న

నీ మామతో రాజకీయ సన్యాసం చేయించి పార్టీలో మళ్లీ చేరు : మేనల్లుడికి మాయావతి కండిషన్

వైద్య శాస్త్రంలో వింత : యువకుడిలో గర్భాశయం - ఆపరేషన్ చేసి తొలగించిన వైద్యులు

నెల్లూరు మస్తాన్‌వలి దర్గాలో ఎ.ఆర్. రెహమాన్, శివమణి ప్రత్యేక ప్రార్థనలు

ఏకంగా 15 సార్లు తిరస్కరణ... అయినా పట్టువదలకుండా రూ.1.1 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం

అన్నీ చూడండి

Udayabhanu: పంచనామాకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా : ఉదయభాను ఎమోషనల్

అదే హుందాతనం, శైలితో గతాన్ని తలచుకుంటూ జనవరి 12 విడుదల

Anupama Parameswaran,: క్రేజీ కల్యాణం నుంచి 'కాకా ధూమ్ ధమాకా సాంగ్ ప్రోమో

Haiku : ఏగన్, శ్రీదేవి.. రొమాన్స్, కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న హైకూ టీజర్

Rashmika: విజయ్ దేవరకొండ నట విశ్వరూపం చూపించిన రణబాలి టీజర్

తర్వాతి కథనం
Show comments