కీరదోస మిశ్రమాన్ని కళ్ల కిందభాగంలో రాస్తే..?
మీ కంటి సౌందర్యం కోసం ఈ టిప్స్ పాటించండి.. ఉదయం రెండు బాదం పప్పులను కొంచెం పాలలో నానపెట్టాలి. రాత్రి వాటిని మెత్తగా చేసి ఆ పేస్ట్‌ను కళ్ళచుట్టూ రాస్తే కంటి కింద వలయాలు తగ్గిపోతాయని బ్యూటీషన్లు అంటున్నారు. ఎండ వేడిని తట్టుకునేందుకు వాడే సన్‌స్క్రీన్ లోషన్ల వంటి వాటిని బయటికి వెళ్ళేటప్పుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా వాడండి.. అప్పుడే ఎలాంటి సమస్యలు దరిచేరవు.
ఎప్పుడూ తీక్షణంగా రెప్పవేయకుండా చూస్తూ కళ్ళపై ఒత్తిడి తీసుకురాకండి. ఎవియన్స్, ఎవాన్ వంటి ఐ క్రీములు, జెల్‌లు వాడవచ్చు. ఇటువంటి జాగ్రత్తలు పాటించినా కళ్ళకింద వలయాలు పోకపోతే చర్మ సౌందర్యానికి సంబంధించిన వైద్య నిపుణులను సంప్రదించండి.
కళ్ళ కిందభాగం ఉబ్బినట్టు ఉంటే రెండు టీ బ్యాగులను వేడినీటిలో కొంచెం సేపు నాంచి ఆ తర్వాత వాటిని కళ్ల మీద 20 నిమిషాలపాటు పెట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది. కీరదోసను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం, పెరుగు కలిపి కళ్ల కింద రాసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారం పాటు క్రమంగా చేస్తే కంటి కిందటి నల్లటి వలయాలు పోతాయి.