పెరుగు, అరటిపండు గుజ్జు ముఖానికి పట్టిస్తే..?
చర్మ సంరక్షణకోసం ఏవేవో క్రీమ్స్ వాడడం కంటే.. ఇంట్లోని పదార్థాలతో అందమైన, కాంతివంతమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చును. దానిమ్మ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందానికి కూడా అంతే దోహదపడుతుంది. ఎలాగో తెలుసుకుందాం..
దానిమ్మ గింజలను మెత్తని పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా తేనె కలిపి ముఖానికి, మెడ భాగంలో రాసుకోవాలి. అరగంట తరువాత రోజ్‌వాటర్‌తో కడిగి.. 5 నిమిషాల పాటు ముఖాన్ని మర్దన చేసుకోవాలి. ఇలా వారం రోజులు క్రమంగా చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. దానిమ్మలోని విటమిన్ సి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
గాలిలో తేమ తక్కువగా ఉండడం వలన చర్మం పొడిబారుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు నిమ్మ, టమోటా రసం మిశ్రమం బాగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి. నిమ్మలోని విటమిన్ స్ చర్మం పీహెచ్‌ను సాధారణ స్థాయికి తీసుకొస్తుంది. టమోటా రసం చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
పెరుగు శరీర వేడిగా తగ్గిస్తుంది. పెరుగు, తేనెను సమపాళ్లతో తీసుకోవాలి. దీనికి అరటిపండు గుజ్జు కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తరువాత కడిగేయాలి. పెరుగులోని విటమిన్ సి, జింక్, క్యాల్షియం చర్మాన్ని శుభ్రం చేస్తాయి. అరటిలోని లెప్టిన్ ప్రోటీన్స్ చర్మం మీద ఎర్రటి మచ్చలు ఏర్పడడాన్ని నివారిస్తుంది.