1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 5 అక్టోబరు 2018 (14:18 IST)

అలసిపోయిన కంటికి కీరదోస- చర్మానికి చెరకు రసం

ఎప్పుడూ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు చూసే కళ్లకు ఉపశమనం కలగాలంటే.. ఈ టిప్స్ పాటించండి. ముఖ్యంగా తీక్షణంగా రెప్పవేయకుండా చూస్తూ కళ్ళపై ఒత్తిడి తీసుకురాకూడదు. కళ్ళ కిందభాగం ఉబ్బినట్టు ఉంటే రెండు టీ బ్యా

ఎప్పుడూ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు చూసే కళ్లకు ఉపశమనం కలగాలంటే.. ఈ టిప్స్ పాటించండి. ముఖ్యంగా తీక్షణంగా రెప్పవేయకుండా చూస్తూ కళ్ళపై ఒత్తిడి తీసుకురాకూడదు. కళ్ళ కిందభాగం ఉబ్బినట్టు ఉంటే రెండు టీ బ్యాగులను వేడినీటిలో కొంచెం సేపు నాంచి ఆ తర్వాత వాటిని కళ్ల మీద 20 నిమిషాలపాటు పెట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది. కీరదోస ముక్కలను కంటిపై వుంచి అలా కాసేపు కళ్లను మూతపెట్టినా కంటి అలసట తొలగిపోతుంది. 
 
అలాగే చెరకు రసం ముఖానికి రాసుకుంటే అలిసిపోయిన చర్మానికి తిరిగి శక్తిని అందిస్తుంది. చర్మంలో సమతూకం ఉండేలా చూస్తుంది. మొహం మీద గీతలు, ముడతలు పడకుండా చేస్తుంది. మృతకణజాలాన్ని నశింపచేసి కొత్త కణజాలం తొందరగా రావడానికి సహాయపడుతుంది. 
 
పిగ్మెంటేషన్ వల్లఏర్పడిన మచ్చలను తొలగించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది. చెరకు రసంతో వారానికి ఒకసారి ఫేషియల్ చేసుకోవడంతో పాటు రాత్రి పూట పడుకోబోయే ముందు నైట్‌క్రీములు, క్లెన్సింగ్ మిల్క్‌ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.