Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

మృదువైన చర్మం కోసం... ఏం చేయాలి?

వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వలన ముఖం నల్లగా మారి కాంతిహీనంగా తయారవుతుంది. దీనిని తొలగించుకోవటానికి రకరకాల లోషన్స్‌ను వాడుతుంటారు. అలాకాకుండా ప్రకృతిలో సహజంగా లభించే పదార్థాలతో మన అందాన్ని మరింత పెంచుకోవచ్చు. ఎండ, దుమ్ము, మరియు ధూళిలో ఎక్కువుగా త

Written By chj
Updated: శనివారం, 2 జూన్ 2018 (21:54 IST)
వేసవికాలంలో ఎండలు ఎక్కువగా ఉండడం వలన ముఖం నల్లగా మారి కాంతిహీనంగా తయారవుతుంది. దీనిని తొలగించుకోవటానికి రకరకాల లోషన్స్‌ను వాడుతుంటారు. అలాకాకుండా ప్రకృతిలో సహజంగా లభించే పదార్థాలతో మన అందాన్ని మరింత పెంచుకోవచ్చు. ఎండ, దుమ్ము, మరియు ధూళిలో ఎక్కువుగా తిరగడం వలన చర్మంపై మృతకణాలు పేరుకుపోయి చర్మం నలుపుగా మారుతుంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం.
 
1. ఒక టమోటా తీసుకొని దానిని మెత్తగా పేస్టులా చేయాలి. దానికి ఒక టీ స్పూన్ తేనె, చిటికెడు పసుపు, ఒక టీస్పూన్ పెరుగును కలిపి దానిని ముఖానికి పట్టించాలి. ఇలా క్రమంతప్పకుండా వారంలో మూడురోజుల పాటు చేయడం వలన చర్మం కాంతివంతంగా మారుతుంది.
 
2. కొద్దిగా టమోటా గుజ్జులో పంచదారను కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి మర్దన చేసుకోవాలి తరచూ ఇలా చేయడం వల్ల చర్మంపై మృతకణాలు తొలగి చర్మం మృదువుగా తయారవుతుంది.
 
3. టమోటా గుజ్జును తీసుకొని ఐస్ క్యూబ్ ట్రేలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఎండలో నుంచి ఇంటికి రాగానే ఈ టమోటా ఐస్ క్యూబ్‌తో మృదువుగా మర్దన చేయాలి. ఇది ఎండ వలన కమిలిపోయిన చర్మానికి స్వాంతన చేకూర్చి సూర్యకిరణాల వల్ల చర్మానికి హాని కలుగకుండా కాపాడుతుంది. ముఖం తాజాగా ఉండేలా చేస్తుంది.
 
4. టమోటా గుజ్జు, కమలా పండు గుజ్జు, కీర రసాన్ని సమాన పరిమాణంలో కలిపి రాత్రిపూట ముఖానికి రాసుకొని సుమారు అరగంట తర్వాత ఆరనిచ్చి కడిగేసుకోవాలి. ఇలా తరచుగా చేయడం వలన పిగ్మెంటేషన్ సమస్య చాలావరకు దూరం అవుతుంది. ముఖం ఛాయ మెరుగవుతుంది. చర్మ గ్రంధులు శుభ్రపడతాయి.
 
5. టమోటా రసంలో కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి ముఖానికి మర్దన చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది.

అన్నీ చూడండి

దేశంలో స్టార్ లింక్ అనుమతులు నిలిపివేయాలి : స్వదేశీ జాగరణ్ మంచ్

బిడ్డతో కలిసి కదులుతున్న రైలు ఎక్కిన తండ్రి.. కాపాడిన ఆర్పీఎఫ్ లేడీ కానిస్టేబుల్ (video)

స్వీట్ బాక్స్ అడిగితే రూ.70 కోట్ల ఆర్డర్.. యుద్ధ ట్యాంక్ కూడా : ఇల్లు ఖాళీ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్ (Video)

టీడీపీలో చేరిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను

ఓ ఉగ్రవాదీ... నువ్వు ఎక్కడికు ఎందుకు వచ్చావ్ (వీడియో)

అన్నీ చూడండి

సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్న విష్ణుప్రియ - నెలకు రూ.33 లక్షల ఆర్జన!? (Video)

ప్రభాస్ 'ది రాజాసాబ్' చిత్రం విడుదలలో ఆ తప్పు చేశాం : నిర్మాత విశ్వప్రసాద్

లోకేష్ కనకరాజు నటించిన డిసి.. ఐదు భాషల్లో సోనీ లివ్‌లోకి రాబోతోంది

Vijay Deverakonda: తిరుమలలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (video)

Vishwak Sen: ఈనగరానికి ఏమైంది రిపీట్ నుంచి ఆర్టిస్టుల గ్యాంగ్ కొత్త పోస్టర్

తర్వాతి కథనం
Show comments