కరివేపాకు గుజ్జును ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే..?
కరివేపాకులో ఆరోగ్య ప్రయోజనాలెన్నో వున్నాయి. రోజూ కరివేపాకును భోజనంలో కలిపిన కరివేపాకు తినటం వలన మూత్రపిండ సమస్యలు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. భోజనంలో కలిపిన కరివేపాకు ఆకులను తినటానికి ఇష్టపడకపోతే, రోజుకు రెండు సార్లు కరివేపాకు రసాన్ని తాగటం వలన కూడా మూత్రపిండ సమస్యలు తగ్గే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అలాగే కరివేపాకు గుజ్జు, శనగపిండి, పాలు లేదా పెరుగు వేసి బాగా కలిపి ఈ పేస్ట్‌ని ముఖానికి రాసుకుని పావు గంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై ఉన్న మొటిమలు, వాటి వల్ల వచ్చే మచ్చలు తగ్గుముఖం పడతాయి. ఇంకా కరివేపాకును స్మూత్‌గా పేస్ట్ చేసి, అందులో నిమ్మరసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. పావు గంట తర్వాత ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకున్న మలినాలు తొలగి కాంతివంతగా మారుతుంది.
అదేవిధంగా, జుట్టు బాగా పెరగాలనుకునేవారు కరివేపాకుని నీళ్లల్లో వేసి మరిగించాలి. ఆ నీటిని తలకు మర్దన చేసుకోవాలి. పావుగంట తర్వాత మామూలు నీళ్లతో తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కరివేపాకును రుబ్బుకుని ఆ రసంలో మూడు స్పూన్ల మెంతి పొడిని కలిపి జుట్టుకు ప్యాక్‌లా వేసుకుని, ఎండిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే తెల్లజుట్టు నలుపుగా మారిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.