శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2017 (15:38 IST)

చర్మంపై ముడతలు తొలగిపోవాలంటే..? తేనె, పాలను..?

చర్మంపై ముడతలు తొలగిపోవాలంటే.. తేనె పాలలో గుడ్డులోని తెల్లసొనను కలపాలి. దానికి చెంచా నిమ్మరసం చేర్చి గిలకొట్టి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి.. మెడకు, చేతులకు పూతలా వేయాలి. బాగా ఆరిన తర్వాత లేదా 20 నిమిషాల

చర్మంపై ముడతలు తొలగిపోవాలంటే.. తేనె పాలలో గుడ్డులోని తెల్లసొనను కలపాలి. దానికి చెంచా నిమ్మరసం చేర్చి గిలకొట్టి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి.. మెడకు, చేతులకు పూతలా వేయాలి. బాగా ఆరిన తర్వాత లేదా 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది ముడతల ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా.. చర్మ సౌందర్యాన్ని పెంపొందింప జేస్తుంది.
 
సన్‌టాన్‌ను తొలగించుకోవాలంటే.. తేనెను ఉపయోగించుకోవచ్చు. ఉదయం పూట మూడు స్పూన్ల పచ్చిపాలలో చెంచా తేనె, చెంచాల సెనగపిండి కలపాలి. దాన్ని ముఖానికి పూతలా వేసుకుని.. అర్థ గంట తర్వాత చన్నీళ్లతో ముఖాన్ని కడిగేసుకుంటే చాలు. ఇలా రోజూ చేస్తుంటే చర్మంపై పేరుకున్న నలుపుదనం తొలగిపోతుంది. చర్మం మెరిసిపోతుంది. 
 
మొటిమలు.. వాటి తాలూకు మచ్చలూ ఇబ్బంది పెడుతుంటే.. చెంచా తేనెలో రెండు చెంచాల నిమ్మరసం, కాస్త గులాబీనీరూ కలిపి ముఖానికి రాసుకోవాలి. దీన్ని పడుకోవడానికి ముందు రాసుకుని ఆరాక కడిగేసుకుంటే సరి. ఇలా రోజూ చేస్తుంటే ఫలితం కనిపిస్తుంది.