గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By selvi
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2017 (12:45 IST)

తేనె-నిమ్మ చెక్కతో సౌందర్యం..

నిద్రకు ఉపక్రమించే ముందు నాలుగైదు చుక్కల తేనెను నిమ్మ చెక్క మీద పోయాలి. ఆ చెక్కతో ముఖ చర్మం మీద సున్నితంగా ఒక నిమిషం పాటు రుద్దాలి. ఐదు నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఈ చిట్కాను నిద

నిద్రకు ఉపక్రమించే ముందు నాలుగైదు చుక్కల తేనెను నిమ్మ చెక్క మీద పోయాలి. ఆ చెక్కతో ముఖ చర్మం మీద సున్నితంగా ఒక నిమిషం పాటు రుద్దాలి. ఐదు నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఈ చిట్కాను నిద్రించే ముందు ఎందుకు చేయాలంటే.. నిమ్మ వంటి సిట్రస్ జాతి ఫలాలు కాంతిగ్రాహకాలు. అందుకని పగటి సమయంలో వల్ల ఫలితం వుండదు. 
 
అందుకే రాత్రిపూట వాటిని ఉపయోగిస్తే ఫలితం మెరుగ్గా వుంటుంది. అలాగే చర్మంపై మృతకణాలను తొలగించుకునేందుకు పచ్చిపాల క్లెన్సర్ ఉపయోగించవచ్చు. పచ్చిపాలను దూదిలో ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చర్మం తాజాగా వుంటుంది. చర్మంపై మృతకణాలు తొలగిపోతాయి.