సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 15 ఏప్రియల్ 2019 (22:39 IST)

కొంతమంది ముఖాలు ఎంతో అందంగా వుంటాయి... కారణం ఏంటి?

కొందరి ముఖాలు ఏంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. చర్మం తేజోవంతంగా ప్రకాశిస్తుంటుంది. తమ చర్మం కూడా అలా మెరవాలంటే ఏం చేయాలో తెలీక, వాళ్ళ కాంతి రహస్యం బోధపడక నిరాశపడుతుంటారు చాలామంది. నిజానికి అదేమంత కష్టమైనా పని కాదు. మన శరీరం మీద మనకు కొంచెం శ్రద్ధ, ఆసక్తి ఉంటే, అలాంటి ఆకర్షణీయమైన చర్మాన్ని మనమూ సొంతం చేసుకోవచ్చు. అప్పుడు మన ముఖంలోనూ గొప్ప వర్చస్సు వస్తుంది. అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
 
1. కమలాఫలం, నారింజ, నిమ్మచెక్కల్ని పారేయకుండా ఎండబెట్టి పొడిచేయండి. ఈ పొడిని ఓ డబ్బాలోకి తీసుకోండి. అప్పుడప్పుడు సెనగపిండిలో కలిపి మోచేతులు, మెడకు పూతలా వేసుకుని కడిగేయాలి. దీనివల్ల అక్కడి చర్మం తాజాగా, మృదువుగా మారుతుంది. 
 
2. కారెట్ జ్యూస్ మహా ఆరోగ్యకరమైనది. ఇది ముఖానికి తేజస్సును ఇస్తుంది.అంతేకాకుండా కళ్లకు కూడా చాలా మంచిది. క్యారెట్ అసిడిటీని తగ్గిస్తుంది. కారెట్లో విటమిన్ ఎ, సీ లు మాత్రమే కాకుండా మరెన్నో పోషక విలువలు ఉంటాయి. 
 
3. బీట్రూట్ జ్యూస్ సైతం చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. పైగా ఇది లివర్‌కు మంచిది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలో ఏమైనా మలినాలు ఉంటే పోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.  
 
4. టొమాటో జ్యూస్ కడిగిన టొమాటోలు నాలుగు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ముఖానికి మంచి గ్లో వస్తుంది. అంతేకాకుండా ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది కూడా. ఇలా జ్యూసులతో మన చర్మ అందాన్ని పెంచుకోవచ్చు.