గర్భం ధరించిన స్త్రీలు.. ఈ ఆహారాన్ని మాత్రం పక్కనబెట్టాల్సిందే
గర్భం ధరించిన స్త్రీలు సాధారణంగా పౌష్టికాహారం తీసుకుంటారు. అనేక జాగ్రత్తలు పాటిస్తారు. కానీ చిన్న చిన్న విషయాలు తెలుసుకోలేక ఇబ్బంది పడతారు. తీసుకోవాల్సిన ఆహారం పట్ల మాత్రమే కాకుండా తీసుకోకూడని ఆహారం విషయంలో కూడా జాగ్రత్త వహించాలి.
అప్పుడే తల్లీ బిడ్డ ఆరోగ్యంగా ఉండవచ్చు. పండ్లు, కూరగాయలను తినే ముందు శుభ్రంగా కడగాలి. లేకపోతే వాటికి అంటుకున్న దుమ్ము ధూళి వలన క్రిములు ఆహారం ద్వారా శిశువుకి చేరుతాయి. పచ్చి మాంసం, పచ్చి గుడ్లు గర్భ సమయంలో సాల్మొనెల్లా వలన కలిగే వ్యాధులను కలుగచేస్తాయి. కాబట్టి గ్రుడ్డు మరియు పిండితో చేసిన ఆహార పదార్థాలను తినకండి.
ఇంకా కస్టర్డ్స్, ఇంట్లో చేసే పిండి పదార్థాలు, కేక్ బట్టర్, ఇంట్లో చేసే ఐస్ క్రీమ్స్, ఎగ్నాగ్, మాయో వంటివి కూడా తినకండి. గర్భ సమయంలో తీసుకోకూడని ఆహార జాబితాలో మొదట బొప్పాయి ఉంటుంది. దీనిని తినటం వలన గర్భ సమయంలో లేదా శిశు జనన సమయంలో అధిక స్రావానికి గురిచేస్తుంది. ఇది గర్భాశయాన్ని సంకోచాలకు గురిచేస్తుంది.
గర్భం ధరించిన మూడు నెలల తరువాత దీన్ని తినకూడదు. దీన్ని తేనె లేదా పాలతో కలిపి తీసుకోవటం వలన దీని శక్తి మరింతగా పెరుగుతుంది. గర్భంతో ఉన్నపుడు షుగర్ ఫూడ్‌ని ఎక్కువగా తినకూడదు. గర్భ సమయంలో ఎక్కువగా షుగర్ తీసుకోవటం మంచిది కాదని ప్రయోగాత్మకంగా నిరూపించబడింది.