శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 1 ఏప్రియల్ 2019 (21:44 IST)

మార్కెట్‌లో కొన్న ఆకుకూరలను అదే రోజు వాడుతున్నారా?

మార్కెట్‌లో కొన్న ఆకుకూరలను అదే రోజు వాడుతున్నారా? అయితే మీరు ప్రమాదం కొనితెచ్చుకుంటున్నట్లే. మార్కెట్‌లో లభించే ఆకుకూరలు తాజాగా, పచ్చగా కనిపించడానికి వాటిపై స్ప్రేలు కొట్టడమే ఇందుకు కారణం. ఈ స్ప్రేల వల్ల ఆకుకూరల తాజాదనం దెబ్బతినకుండా ఉంటుంది. రసాయనాలతో తయారుచేసిన ఇలాంటి స్ప్రేలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
 
అదేరోజు కడిగి వాడినా సరే ఎంతో కొంత ప్రభావం తప్పకుండా ఉంటుంది. వీటి ప్రభావం ఆకు కూరలపై 24 గంటల వరకు ఉంటుంది. అందుకే ఆకుకూరలు కొన్నరోజు కాకుండా.. మరుసటి రోజు వాడుకుంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు. 24 గంటల తర్వాత ఉప్పునీటిలో ఆకుకూరలను చక్కగా కడిగి వాడుకోవాలని వారు అంటున్నారు. ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కొంత మేరకు కాపాడుకున్నట్లే.