సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (13:57 IST)

ఈ 3 చిట్కాలు పాటిస్తే.. ఏమవుతుంది..?

కళ్ల కింద నల్లటి వలయాలు ఉన్నాయా.. వీటి కారణంగా ముఖం చూడడానికి కళావిహీనంగా కనిపిస్తోందా.. అయితే కొన్ని చిట్కాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే సరిపోతుంది.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..
 
1. దోసకాయ, నిమ్మకాయ, టమోటా రసాలను కలిపి దాన్ని కళ్లకింద రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తుంటే కళ్లకు చాలా మంచిది.
 
2. టమోటా, బంగాళాదుంప, నిమ్మరసాన్ని కలిపి కంటి కింద రాసుకుంటే చర్మం రంగులో మెరుపుతోపాటు మృదుత్వం కూడా వస్తుంది. అలానే దోసకాయ, బంగాళాదుంప రసాలను కూడా కలిపి కళ్ల కింద రాసుకోవచ్చు ఫలితం ఉంటుంది.
 
3.  బాదం నూనె‌ను ఉంగరం పెట్టుకునే వేలితో ఓ నిమిషం పాటు కళ్ల కింద రాయాలి. అక్కడున్న చర్మంపై సున్నితంగా మర్దన చేయాలి. ఇలా మర్దన చేసేటప్పుడు ఒక దిశలోనే చేయాలి. 15 నిమిషాలత అలానే ఉంచి.. అనంతరం తడిగా ఉన్న కాటన్ ఊల్‌తో సున్నితంగా కళ్ల చుట్టూ తుడవాలి.