పాలను ఇలా కూడా వాడుకోవచ్చా? మీగడతో?
పాలు ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుందట. పాలు తాగటం వల్ల కళ్ళు ప్రకాశవంతంగా అవుతాయి. శరీరానికి ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది. ఆరోగ్యంగా వుండాలంటే.. రోజూ రెండు గ్లాసుల పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేగాకుండా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే.. కూడా పాలను ఇలా వాడుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. అదెలాగో చూద్దాం..
ప్రతి రోజు పాలను పెదాలకు మర్ధన చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల పెదాల నలుపుదనం పోయి అందంగా కనిపిస్తాయి.పాలలో కొంచెం తేనెను కలిపి బాగా మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. పాలల్లో ఒక స్పూన్ తేనె, కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి కొంత సమయం తర్వాత స్నాసం చేయడం వల్ల మంచి టోన్ లభిస్తుంది.
పాలలో కొంచెం ముల్తాని మట్టి కలిపి ఫేస్ ప్లాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. పాలపైని మీగడలో కొద్దిపాటి వెనిగర్, చిటికెడు పసుపు కలిపి గాయాలకు రాస్తే.. అవి తగ్గిపోతాయి. ఇంకా చర్మ సంబంధిత అలెర్జీలను తొలగించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.