శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (19:02 IST)

పగిలే పెదవులకు గుడ్ బై.. లిప్ స్క్రబ్‌లు ఇంట్లోనే ఇలా? (Video)

శీతాకాలంలో పెదవులు పగులుతున్నాయా? పెదవులకు ఏవి పడితే లిప్ బామ్‌లు రాసేస్తున్నారా? అయితే ఇక వాటిని ఆపండి. ఎందుకంటే.. ఇంట్లోనే సులభంగా చేసుకునే లిప్ స్క్రబ్‌లు ఎలా తయారు చేయాలో చూడండి. తద్వారా రోజా రేకుల్లాంటి పెదవులను పొందండి అంటున్నారు బ్యూటీషియన్లు. సహజ సిద్ధమైన పదార్థాలతో రోజా రేకుల్లాంటి మృదువైన పెదవులను పొందడం కోసం ఏం చేయాలంటే?
 
కాఫీ లిప్ స్క్రబ్ 
కాఫీ పొడి చర్మానికి మెరుగ్గా పనిచేస్తుంది. అలాంటి కాఫీ పొడితో లిప్ స్క్రబ్ ఎలా చేయాలంటే..? కాఫీ పొడి, తేనె రెండింటిని బాగా మిక్స్ చేసుకుని రోజూ ఉదయం పెదవులకు రాసుకుని పది నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మంచి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడి.. పెదవులను సున్నితంగా, మృదువుగా తయారు చేస్తాయి. 
 
పంచదార ఆలివ్ ఆయిల్ 
అలాగే సులభమైన మరో లిప్ స్క్రబ్ ఏంటంటే? పంచదాల మంచి స్క్రబర్. చర్మానికి స్క్రబ్ చేసేందుకు పంచదార చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుచేత పంచదార, ఆలివ్ ఆయిల్‌లను అరస్పూన్ మేర మిక్స్ చేసుకుని రోజూ పెదవులకు రాస్తూ వుంటే పెదవులు మృదువుగా, కోమలంగా తయారవుతాయి. 
 
బ్రౌన్ షుగర్-కొబ్బరి నూనె స్క్రబ్ 
కొబ్బరి నూనె కూడా పెదవులకు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. చర్మానికి కొబ్బరి నూనె చాలా మేలు చేస్తుంది. అలాంటి కొబ్బరి నూనెతో పంచదార లేకుంటే బ్రౌన్ షుగర్ వేసి బాగా స్క్రబ్‌లా సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులకు పది నిమిషాల పాటు పట్టించాలి. ఈ మిశ్రమం పెదవులను పగులకుండా నివారిస్తుంది. పెదవులు పొడిబారకుండా చేస్తుంది. 
 
దాల్చిన చెక్క పొడి, తేనె, ఆలివ్ ఆయిల్‌లో లిప్ స్క్రబ్ 
దాల్చిన చెక్క పొడి, తేనె చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనికి ఆలివ్ ఆయిల్ తోడైతే ఇక ఫలితం సూపర్‌గా వుంటుంది. అరస్పూన్ దాల్చిన చెక్క పొడికి పావు స్పూన్ తేనె, పావు స్పూన్ ఆలివ్ ఆయిల్ చేర్చి.. బాగా కలిపి.. పెదవులకు రాసుకుంటే.. పెదవులు మెరిసిపోతాయి.

సున్నితంగా తయారవుతాయి. అయితే ఈ స్క్రబ్‌లను రోజుకు ఓసారి వారానికి మూడుసార్లు లేదా నాలుగు సార్లు ఉపయోగిస్తూ.. బీట్ రూట్ రసంతో తయారైన లిప్ బామ్‌ను వాడితే మంచి ఫలితం వుంటుంది.