సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 18 డిశెంబరు 2018 (18:38 IST)

ఇవి తింటే చర్మం మెరిసిపోతుంది... యవ్వనంగా...

సాధారణంగా స్త్రీలు అందంపై బాగా శ్రద్ధ పెడుతుంటారు. అందంగా కనిపించటం కోసం రకరకాల ఫేస్ ప్యాక్‌లు వేసుకోవడం, రకరకాల క్రీములు రాస్తుండడం, బ కొన్ని ఆహారపదార్థాలు వయసు కనిపించనీయకుండా చర్మం మెరిసేలా చేస్తాయి. సాధారణంగా  మనం తీసుకునే ఆహారమే మన అందాన్ని, ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. 
 
మన శరీరానికి రక్షణ కవచమైన చర్మం మన ఆరోగ్య స్థితిని చెప్పకనే చెబుతుంది. పుట్టిన నాటి నుంచి మన శరీరంతో పాటు చర్మంలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. చిన్నపిల్లలప్పుడు లేత చర్మం పెద్దవాళ్లయ్యేప్పటికి పూర్తిగా మారిపోతుంది. ఇది ప్రకృతి సహజంగా జరిగే మార్పే అయినా సరైన ఆహారం, చక్కటి జీవనశైలి ద్వారా వృద్ధాప్యపు జాడలని మన దరికి చేరనీయకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు. 
 
బ్యూటీపార్లర్ చుట్టూ తిరగటం చేస్తుంటారు. కాని ఇది సరియైన పద్దతి కాదు. కేవలం మనం తినే ఆహారపదార్ధాలలో మార్పు చేసుకోవడం వల్ల మాత్రమే మన చర్మాన్ని అందంగా, కాంతివంతంగా మార్చుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.
 
1. బీటా కెరాటిన్‌లు వయసు ఛాయలు రాకుండా చర్మాన్ని కాపాడతాయి. ఇవి పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. దీనిని రోజూ ఆహారంలో తీసుకుంటే నలభైలలో కూడా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.
 
2. చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో సబ్జా గింజలు ముందుంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. రోజూ ఒక స్పూను సబ్జా గింజల్ని తింటే చర్మం యౌవనంగా ఉంటుంది.
 
3. టమోటాలో ఉండే లైకోపీన్‌ చర్మానికి మంచి మెరుపుని అందిస్తుంది. ఇందులో యాంటీ ఏజింగ్‌ లక్షణాలు చాలా ఎక్కువ. కాలుష్యం నుంచి, హాని కారక సూర్యకిరణాల నుంచి లైకోపీన్‌ కాపాడుతుంది.
 
4. చర్మ సౌందర్యానికి ఎంతో అవసరమయ్యే విటమిన్‌ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు బాదం పలుకుల్లో పుష్కలంగా ఉంటాయి. రోజూ నాలుగు బాదం పలుకుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన తింటే మంచిది.
 
5. క్యారెట్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే బీటా కెరోటీ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవ్వటంతో పాటు చర్మానికి, కురులకు మంచి ప్రయోజనాలను చేకూర్చుతుంది. కాబట్టి మెరిసేటటువంటి చర్మ సౌందర్యం పొందాలనుకుంటే ప్రతి రోజూ క్యారెట్ తినడం కానీ, లేదా క్యారెట్ జ్యూస్ తాగడం కానీ చేయాలి.
 
6. దోసకాయను తొక్కుతో తినడం మంచిది. తొక్కులో విటమిన్‌ 'కె' సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కులో వుంది. దోసకాయ మంచిది కదా అని ఊరగాయల రూపంలో తినకూడదు. కీరదోసకాయ రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు పోతాయి.
 
7. బీట్‌రూట్ దుంపల్లో అధిక శాతంలో ఐరన్ మరియు విటమిన్స్ ఉండి, చర్మగ్రంధులను శుభ్రం చేయడానికి, రక్త ప్రసరణ జరగడానికి, ముఖంలో పింక్ గ్లో తేవడానికి సహాయపడుతాయి. కాబట్టి ప్రతి రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగాలి. అలాగే దీన్ని ఫేస్ ఫ్యాక్‌గా కూడా వేసుకోవచ్చు. 
 
8. వయస్సును తగ్గించడంలో ప్రతి రోజూ మనం తీసుకొనే డైట్‌లో నీరు కూడా ఒక భాగమే. నీరు ఇంటర్నల్ గాను, ఎక్సటర్నల్‌గాను మంచి ప్రయోజనకారి. ప్రతి రోజూ ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరానకి కావల్సిన తేమ అంది ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ కనీసం 6-8 గ్లాసుల నీళ్లు తాగటం అన్నది స్వేదగ్రంథుల నుంచి విషపదార్థాలను బయటికి విసర్జించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.