శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (17:07 IST)

దీపావళి ధమాకా.. వంటనూనె ధరలను తగ్గించిన కేంద్రం

దీపావళి రోజున పెట్రోల్, డీజిల్‌పై తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంధన ధరల తగ్గుదుల ఇతర ధరలపై కూడా ప్రభావం చూపుతుందని, కాబట్టి రానున్న రోజుల్లో మరిన్ని వస్తువుల ధరల్లోనూ తగ్గుదుల ఉంటుందని కొందరు ఆర్థిక వేత్తలతో పాటు, బీజేపీ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. 
 
తాజాగా కేంద్రం ప్రజలకు మరో శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా వంటనూనె ధరలను తగ్గిస్తున్నట్లు శుక్రవారం కేంద్రం వెల్లడించింది. లీటర్ వంట నూనెపై రూ. 7 నుంచి, రూ. 20 వరకు తగ్గించింది. 
 
ఇందులో భాగంగా పామాయిల్‌పై రూ. 20, వేరుశెనగ నూనెపై రూ. 18, సోయాబీన్‌పై రూ. 10, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై రూ. 7 తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గత కొన్నిరోజులుగా ధరల పెరుగుదలతో సతమతమైన ప్రజలకు కాస్త ఊరట కలిగినట్లైంది.