శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (16:28 IST)

పాకిస్తాన్‌లో వరదలు బీభత్సం.. 24 గంటల్లో 120మంది మృతి

Tomato
పాకిస్తాన్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు ముంచెత్తడంతో ఇప్పటివరకు వేయి మందికి పైగా మృతి చెందారని ప్రకటించింది జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ. 
 
గడిచిన 24 గంటల్లో సుమారు 120 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. మరో 1500 మంది గాయపడ్డారు. గత మూడు దశాబ్దాలతో పోలిస్తే ఇది 192 శాతం ఎక్కువని పాకిస్తాన్ వాతావరణశాఖ తెలిపింది.  
 
లాహోర్ మార్కెట్ హోల్‌సేల్ ధరలు చుక్కలు చూస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఉల్లిపాయలు, టొమాటో ధర కిలో రూ.700 దాటవచ్చని అక్కడి వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
 
పాకిస్తాన్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కూరగాయలతో పాటు పలు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. 
 
గత వారంలో 23 నిత్యావసర వస్తువులు, కూరగాయలు, గుడ్లు, పప్పులు, ఇతర వస్తువుల సగటు ధరలు పెరిగాయని పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (పీబీసీ) విడుదల చేసిన డేటా వెల్లడించింది.