మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 జనవరి 2021 (11:27 IST)

బంగారం ధరలు తగ్గిపోయాయోచ్..

బంగారం ధరలు గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం పెళ్లిళ్లు అధికంగా ఉండటంతో బంగారం, వెండి ధరలకు రెక్కలు వచ్చాయి. కరోనా నేపథ్యం తర్వాత మాములు ప్రజలైతే బంగారం అంటేనే భయపడేలా బంగారం రేట్లు పెరిగిపోయాయి. 10 గ్రాముల బంగారం ధర రికార్డ్ స్థాయిలో రూ.50 వేలు దాటిపోయింది. అయితే... తాజాగా బంగారం ధరలు తగ్గాయి. 
 
శుక్రవారం రోజున బంగారం ధరలు నిలకడగా ఉండగా.. ఈరోజు ధరలు తగ్గాయి. అయితే ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 450 తగ్గి రూ.45,750 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 500 తగ్గి రూ.49,00 కి చేరింది. ఇక కిలో వెండి ధర రూ. 400 తగ్గి రూ.70,300 కి చేరింది.