Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం గుడ్‌ న్యూస్‌... త్వరలో జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వ్యవస్థ

Written By సెల్వి
Updated: మంగళవారం, 2 మార్చి 2021 (10:53 IST)
వాహనాదారులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వ్యవస్థను త్వరలో తీసుకురానున్నట్లు కేంద్ర రవాణా, రహదారుల శాఖల మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా జాతీయ రహదారిపై ప్రవేశించిన పాయింట్ నుంచి దిగిపోయిన పాయింట్‌ వరకు ప్రయాణించిన వరకే టోల్‌ చార్జీలను ఇందులో చెల్లించవచ్చనని చెప్పారు. కాకపోతే ఈ వ్యవస్థ రావడానికి రెండేళ్లు పట్టవచ్చన్నారు.
 
జాతీయ రహదారులపై టోల్‌ వసూళ్ల కోసం ఫాస్టాగ్‌ విధానాన్ని తప్పనిసరి చేయడం వల్ల వాహనాల రద్దీ గణనీయంగా తగ్గినట్లు తెలిపారు. దీని వల్ల ప్రతి ఏటా రూ.20 కోట్ల మేర ఇంధనం రూపంలో ఆదా అవుతుందని, కనీసం రూ.10 వేల కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని మంత్రి వివరించారు.
 
టోల్‌ ప్లాజాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన వ్యవస్థను సోమవారం (మార్చి 1,2021) మంత్రి ప్రారంభించారు. అదే విధంగా జాతీయ రహదారులకు రేటింగ్‌ వ్యవస్థను విడుదల చేశారు. ఈ ఏడాది(2021) ఫిబ్రవరి 16 నుంచి ఫాస్టాగ్‌ను దేశవ్యాప్తంగా అన్ని వాహనాలకు తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే.
 
టోల్‌ ప్లాజాల దగ్గర జాప్యాన్ని ఒక నిమిషం లోపునకే పరిమితం చేస్తామని మంత్రి చెప్పారు. టోల్‌ ప్లాజాలను ఆన్‌లైన్‌లోనే పర్యవేక్షించే వ్యవస్థ ఆదాయపన్ను, జీఎస్‌టీ, ఇతర అధికారులకు ముఖ్యమైన సాధనంగా మారుతుందన్నారు. 
 
జాతీయ రహదారుల నిర్మాణం రికార్డు స్థాయిలో రోజుకు 33 కిలోమీటర్లకు చేరుకున్నట్టు మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.11,035 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు.

అన్నీ చూడండి

'ఛత్రపతి' విలన్ ఇకలేరు.. కేన్సర్‌తో ముంబైలో కన్నుమూత

Aamani: సీతాకోకలా విహరించే ఏడుగురు మహిళల హ్యాపీ జర్నీ

డెక్స్ట్రోకార్డియా ఉండే అరుదైన కథతో చిరంజీవి రాబోతోంది

Nani: నాని పోషించిన జడల్ పాత్ర ప్రమాదకరమైన గద్దలా ది ప్యారడైజ్ పోస్టర్

Ram: పాండిచ్చేరిలో RAPO23 కోసం పాట, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments