కరోనా విజృంభణ : మార్చి 14 వరకు పాఠశాలలు బంద్

schools closed
ఠాగూర్| Last Updated: ఆదివారం, 28 ఫిబ్రవరి 2021 (14:48 IST)
మహారాష్ట్రంలో కరోనా వైరస్ మళ్లీ వింజృంభిస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలోని పట్టణాలే అధికంగా ఉన్నాయి. పూణెతో పాటు.. నాగ్‌పూర్, అమరావతి తదితర ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి.

ఈ క్రమంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం ప్రభుత్వ పాలకుల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనికితోడు కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడంతో మార్చి 14 దాకా స్కూళ్లు తెరవొద్దని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, ఇతర విద్యాసంస్థలన్నీ మార్చి 14 దాకా మూసే ఉంటాయని పూణే మేయర్ మురళీధర్ మోహోల్ ప్రకటించారు.

అదేసమయంలో రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అత్యవసరాలు, నిత్యవసరాలు తప్ప వేరే దేనికీ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అనుమతినివ్వబోమని మేయర్ తేల్చి చెప్పారు. ఈ మేరకు ఫిబ్రవరి 28 వరకు ప్రకటించిన నిబంధనలను పొడిగిస్తున్నట్టు ప్రకటించారు.

వాస్తవానికి చాలా నెలల పాటు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించిన తర్వాత పూణెలో స్కూళ్లను జనవరిలో తెరిచారు. స్కూళ్లకు వచ్చే ముందు విద్యార్థులు, టీచర్లు విధిగా ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఆ మేరకు జనవరిలో పాఠశాలలు, కాలేజీలను తెరిచారు. కానీ, కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ఫిబ్రవరిలో మూసేశారు. ఆ నిబంధనలను ఇప్పుడు పొడిగించారు. కాగా, ఆదివారం ఒక్కరోజే మహారాష్ట్రలో 8,623 కొత్త కేసులు నమోదు కాగా.. పూణెలో వెయ్యికిపైగా రికార్డ్ అయ్యాయి.దీనిపై మరింత చదవండి :