గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 26 మార్చి 2018 (19:09 IST)

చదువుకోవడం మరింత సరదాగా... హైదరాబాద్ నెక్ట్స్ ఎడ్యుకేషన్ క్యూఆర్ కోడ్స్ పుస్తకాలు

హైదరాబాద్: భారతదేశంలో ప్రముఖ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ ప్రొవైడర్లలో ఒకటి మరియు కే-12 విభాగంలో లీడర్ అయిన నెక్ట్స్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తన పాఠ్య పుస్తకాలపై క్యూఆర్ కోడ్స్‌ని చేర్చింది. ఈ చర్య దేశంలోని విద్యా విభాగంలో ఒక కొత్త డిజిటల్ అలజడి

హైదరాబాద్: భారతదేశంలో ప్రముఖ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ ప్రొవైడర్లలో ఒకటి మరియు కే-12 విభాగంలో లీడర్ అయిన నెక్ట్స్ ఎడ్యుకేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తన పాఠ్య పుస్తకాలపై క్యూఆర్ కోడ్స్‌ని చేర్చింది. ఈ చర్య దేశంలోని విద్యా విభాగంలో ఒక కొత్త డిజిటల్ అలజడిని కలిగించింది. 2డి/3డీ యానిమేషన్స్, వాస్తవ జీవితం వీడియోలు మరియు డిజిటల్ సిములేషన్స్ వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా నెక్ట్స్ ఎడ్యుకేషన్ టెక్-ఆధారిత పరిష్కారాలు టీచర్లు మరియు విద్యార్థుల కోసం బోధన-నేర్చుకునే అనుభవాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. 
 
సాంకేతికతని పాఠ్య పుస్తకాలతో సమీకృతం చేయటానికి మరియు విద్యార్థులకు ఉన్నతమైన నాణ్యత, క్రాస్-ఛానెల్ మల్టీ మీడియా కంటెంట్ అందించటానికి పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ విస్తృతిని అనుసరించటానికి నెక్ట్స్ ఎడ్యుకేషన్ భారతదేశపు మొదటి కంపెనీల్లో ఒకటి. ఈ ప్రత్యేకత 17 లక్షలకి పైగా విద్యార్థులకు ప్రయోజనం కలిగిస్తుంది.
 
నెక్ట్స్ ఎడ్యుకేషన్ తన పాఠ్య పుస్తకాల్లో కీలకమైన ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్స్‌ని ఉంచింది. ఇవి విద్యార్థుల ప్రమేయం, నేర్చుకోవటాన్ని శక్తివంతం చేయడం, ముఖ్యమైన భావనల్ని గురించి మరింత లోతుగా అర్థం చేసుకోవటంలో సహాయపడటానికి హుక్స్‌గా పని చేస్తాయి. ఉదాహరణకు, జీర్ణ ప్రక్రియ గురించి చదివేటప్పుడు, విద్యార్థులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలి. ఇది జీర్ణ వ్యవస్థలో ఆహారం ప్రయాణించే సిములేటెడ్ వీడియోకి వారిని రీడైరక్ట్ చేస్తుంది. తాము ఎంత బాగా భావనని అర్థం చేసుకున్నాము అని తెలుసుకోవటానికి వారు పాప్ క్విజ్ తీసుకోవచ్చు లేదా విషయంపై ఇ-పుస్తకాలకు సంబంధించిన వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
 
ఈ అభివృద్ధి గురించి నెక్ట్స్ ఎడ్యుకేషన్ సీఈఓ, సహ-స్థాపకులు బియాస్ దేవ్ రల్హన్ ఇలా అన్నారు, "భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో అతి పెద్ద యువజనుల జనాభా కలిగిన దేశం. అనగా అంతర్జాతీయంగా కూడా నేర్చుకునే సంభావ్యత కలిగిన వారికి కూడా అతి పెద్ద కేంద్రంగా ఉందని అర్థం. తమ నేర్చుకునే అనుభవాన్ని పెంచుకోవటానికి ఈ యువ వినియోగదారుల జనాభా ఆధునిక సాంకేతిక సాధనాల్ని అందుబాటులో ఉంచుకోవల్సిన అవసరం ఉంది. అయితే, ల్యాప్ టాప్స్, టాబ్లెట్స్ మరియు పీసీల వంటి అత్యధిక డిజిటల్ సాధనాలు ఇప్పటికీ వ్యయభరితంగా ఉన్నాయి మరియు దేశంలో చాలామందికి అందుబాటులో లేవు. భౌతిక పుస్తకాలు భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన విద్యా మాధ్యమంగా ఉన్నాయి. నిమగ్నమయ్యే, లోతైన, గొప్ప అనుభవాన్ని దేశంలో నేర్చుకునే వారికి అందించటానికి పుస్తకాలు మరియు స్మార్ట్ ఫోన్స్ విస్తృతిని ఉపయోగించాలని మేము కోరుకుంటున్నాము.'
 
నెక్ట్స్ ఎడ్యుకేషన్ గురించి
నెక్ట్స్ ఎడ్యుకేషన్ నవ్యత మరియు సాంకేతిక ఆధారిత కే-12 సొల్యూషన్స్‌తో చదువుని మారుస్తోంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఆర్మీ మరియు రాష్ట్రాల్లోని అన్ని బోర్డ్స్ సిలబస్‌ని ఏడు భారతీయ భాషల్లో కవర్ చేస్తున్న ఈ సొల్యూషన్స్‌ని 150,000+ టీచర్లు భారతదేశంలో 10,000+  పాఠశాలల్లో  10,000,000 విద్యార్థులు నేర్చుకోవటానికి ఉపయోగిస్తున్నారు. 2007 నుండి నెక్ట్స్ ఎడ్యుకేషన్ వారి విద్యా పరిష్కారాలు మరియు సేవలు జాతీయంగా మరియు అంతర్జాతీయంగా అందరూ మెరుగ్గా పొందుతున్నారు.