గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 14 జూన్ 2017 (13:05 IST)

దొంగ అని ఇద్దరు తాగుబోతులే అరిచారు.. బ్యాంకులకు ఎగనామమా? తీర్పు వరకు ఆగలేరా?: మాల్యా

బ్యాంకులకు ఎగనామం వేసి లండన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. భారత మీడియాపై ఫైర్ అయ్యాడు. బ్యాంకులకు తాను బకాయిలు లేనని మాల్యా స్పష్ట చేశారు. అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని లండన్ కోర్టు

బ్యాంకులకు ఎగనామం వేసి లండన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా.. భారత మీడియాపై ఫైర్ అయ్యాడు. బ్యాంకులకు తాను బకాయిలు లేనని మాల్యా స్పష్ట చేశారు. అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని లండన్ కోర్టులో మంగళవారం నాడు వాదనలు వినిపించారు. అంతేకాకుండా బెయిల్ కూడా పొందారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మాల్యా స్పందిస్తూ.. బ్యాంకులకు బకాయిలు పడి.. భారత్ నుంచి లండన్ వచ్చేసానంటూ భారత ప్రసార మాధ్యమాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలన్నాడు. 
 
భారత మీడియా తనపై హద్దుల్లేని దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. భారత సర్కారు యూకే కోర్టులో ఓ కేసు వేసిందని చెప్పాడు. ఆ కేసు తీర్పు వచ్చేంతవరకు ఆగలేరా? అంటూ ప్రశ్నించారు. బ్యాంకులకు ఎగనామం వేసాననేందుకు తనకు వ్యతిరేకంగా భారత్ వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్నాడు.
 
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఓవల్ మైదానంలో జరుగుతున్న క్రికెట్ పోటీలు చూసేందుకు వచ్చిన విజయ్ మాల్యాను దొంగ అని అన్నట్లు మీడియాలో వచ్చిన వార్తలపై కూడా లిక్కర్ కింగ్ స్పందించారు. తనను దొంగ అని ఎవ్వరూ అనలేదని, ఇద్దరు తాగుబోతులు మాత్రమే అరిచారని, భారత మీడియా అసత్యాలను ప్రచారం చేస్తుందని విమర్శించారు.