బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 నవంబరు 2023 (16:16 IST)

భారీగా పెరిగిన ఎల్పీజీ ధర.. నవంబర్ 1 నుంచి రూ.100 పెంపు

LPG Cylinder
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు షాక్ ఇచ్చాయి. బుధవారం ఎల్పీజీ సిలిండర్ ధర భారీగా పెరిగింది. సిలిండర్ ధరను వంద రూపాయలు పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
పెరిగిన ధర నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. గత రెండు నెలల్లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర పెంచడం ఇది రెండోసారి. ప్రస్తుతం గృహావసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్‌కు మినహాయింపు ఇచ్చారు. 
 
తాజా ధరల పెంపు తర్వాత ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర 1,833కి చేరనుంది. ఇతర ప్రధాన నగరాల విషయానికొస్తే, కోల్‌కతాలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,943, ముంబై రూ.1,785, చెన్నై రూ. 1,999.50, బెంగళూరులో రూ.1,914.50గా వుంది.