Webdunia - Bharat's app for daily news and videos

Install App

January 1, 2022 నుంచి జీఎస్టీ బాదుడు.. 5 నుంచి 12 శాతానికి పెంపు

Written By సెల్వి
Updated: శుక్రవారం, 31 డిశెంబరు 2021 (15:01 IST)
నిరుపేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలపై 2022, జనవరి 1 నుంచి కేంద్రం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో మోయ లేని భారం మోపనుంది. బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని మొదట అమల్లోకి తీసుకొచ్చినప్పుడు 5 శాతం పన్ను మోపింది. దీన్ని జనవరి 1, 2022 నుంచి 12 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
 
ఈ పన్నుల పెంపుదల వల్ల అసంఘటిత రంగంలోని చేనేత, జౌళి, పాదరక్షల ఉత్పత్తుల అమ్మకాలకు గడ్డు కాలం రానుంది. దీని ప్రకారం ఇకపై ఆన్‌లైన్, ఈ-కామర్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా పొందే సేవలపై కూడా జీఎస్టీ చెల్లించాల్సిందే. 
 
స్విగ్గీ, జొమోటో, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా లాంటి వాటి ద్వారా పొందే సేవల పైనా, ట్రాన్స్‌పోర్టు రంగంలో ఉన్న ఓలా, ఊబెర్‌ సంస్థలు అందించే సేవల పైనా 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. 
 
కరోనా వల్ల ఇప్పటికే కుదేలైన మోటారు రంగంపై ఈ భారం మోయలేనిది. ఒక పక్క గ్యాస్‌ ధరలు, మరోపక్క జీఎస్టీ పెంపుదలతో హోటల్‌ రంగానికి కూడా ఇకపై గడ్డుకాలమే. కరోనా వల్ల కుదేలైన పర్యాటక రంగానికి జీఎస్టీని పెంచడం చేదు వార్తే.
 
జీఎస్టీ కమిషన్‌ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఇకనుంచీ పన్నుల రీఫండ్‌ మార్పుల కోసం ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి. 

అన్నీ చూడండి

Dhanush: ఇరుముడి నటి నక్షత్రను వీడియో కాల్‌లో ధనుష్ ప్రశంస, రష్మిక కితాబు

Kiku chiranjeevi: మా ఫ్లెక్సీలను తీసేసి డబ్బింగ్ సినిమా ఫ్లెక్సీలు పెడుతున్నారు : కికు యనమల

Thammareddy Bharadwaja :పెళ్లి చేసి చూడు అంటారు. అలా కొత్త సినిమా మేకింగ్ లో ఇబ్బందులు దాటాం

మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్ తో జగమే సంగీతం' ట్రైలర్‌

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ సినిమా హైవాన్ ట్రైలర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments