ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (13:13 IST)

తగ్గనున్న పెట్రోల్, డీజిల్‌ ధరలు.. అంతా క్రూడ్ ఆయిల్ ఎఫెక్టే

petrol pump
పెట్రోల్, డీజిల్‌ ధరలు అనేవి అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలపై ఆధారపడి ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే గత కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోతున్నాయి. దీంతో వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. 
 
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం భారీగా తగ్గించనుంది. క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో త్వరలోనే కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.10 తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది. ఈ ఏడాది మార్చి నెలలో అంటే సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించింది కేంద్రం. 
 
లీటర్ పెట్రోలు, డీజిల్‌లో మార్చి 14, 2024 రోజున రూ.2 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అప్పటి నుంచి ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.