శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (12:37 IST)

పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు.. రెండేళ్ళ గరిష్ట స్థాయికి!

దేశంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయ. ఈ పెరుగుదల రెండేళ్ళ గరష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం లీటర్ పెట్రోలు, డీజిల్‌పై 25 నుంచి 33 పైసల వరకు ధరలను పెంచుతున్నట్టు చమురు కంపెనీలు వెల్లడించాయి. 
 
దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ.83.71కి, డీజిల్ ధర రూ.73.87కు చేరుకున్నాయి. నవంబర్ నెలలో 20వ తేదీ నుంచి ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. గత నెల 20తో పోలిస్తే, లీటరు పెట్రోలుపై రూ.3.65, డీజిల్ పై రూ.3.40 వంతున ధరలు పెరిగాయి. 
 
ఇకపోతే, ముంబై నగరంలో సోమవారం పెట్రోల్ ధర 33 పైసలు పెరిగి రూ.90.34కు చేరగా, కోల్‌కతాలో రూ.85.19కి, చెన్నైలో రూ.86.51కి చేరింది. ఇదేసమయంలో డీజిల్ ధర ముంబైలో రూ.80.51కి, కోల్‌కతాలో రూ.77.44కు, చెన్నైలో రూ.79.21కి చేరాయి. 
 
ఒపెక్ దేశాలన్నీ ముడి చమురు ఉత్పత్తిని తగ్గించడం, రష్యా కూడా అదే దారిలో నడుస్తూ ఉండటంతోనే క్రూడాయిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.