బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 మే 2020 (09:24 IST)

లాక్ డౌన్ ఎఫెక్ట్.. మరో మూడు నెలల పాటు మారటోరియం పొడిగింపు?

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ఆర్బీఐ ప్రజలకు, పరిశ్రమలకు చేయూత కోసం మారటోరియాన్ని మరో మూడు నెలలు పొడిగించే అంశంపై పరిశీలిస్తోంది. లాక్ డౌన్ కారణంగా డబ్బుల్లేక ప్రజలు, పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. తీసుకున్న రుణాలు కట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మారటోరియాన్ని మూడు నెలల పాటు పొడిగించడంపై పరిశీలన జరుగుతోంది. 
 
కాగా దేశ వ్యాప్తంగా మే 17 వరకు లాక్ డౌన్ పొడిగింపు అంటే 54 రోజుల పాటు ఆర్థిక వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. వ్యాపారాలు లేక వ్యాపారులు, ఉద్యోగుల చేతిల్లో డబ్బులు లేవు. లాక్ డౌన్ మళ్లీ పొడిగిస్తారా లేదా కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో మారటోరియాన్ని పొడిగిస్తే ప్రజలకు కాస్త ఊరటనిచ్చినట్లు అవుతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.