శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 నవంబరు 2021 (17:26 IST)

ఆర్బీఐ కీలక నిర్ణయం... రూ.5వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు...

బ్యాంకింగ్‌ రంగం విషయంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన బాబాజీ డేట్‌ మహిళా సహకారి బ్యాంక్‌, యవత్మాల్‌కు ఆర్బీఐ షాకిచ్చింది.
 
సహకార బ్యాంకు ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఈ చర్యలకు దిగింది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌, 1949 కింద విధించిన ఆంఓలు నవంబర్‌ 8, 2021 ముగిసిన నాటి నుంచి ఆంక్షలు విధించింది. విత్‌డ్రా పరిమితులపై షరతులు విధించింది. 
 
ఈ కారణంగా బ్యాంకు వినియోగదారులపై ప్రతికూల ప్రభావం పడే అకాశం ఉంది. బ్యాంకు కస్టమర్ల ఖాతాల్లో ఎంత డబ్బు ఉన్న కేవలం రూ.5వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా బ్యాంకు ఇకపై కొత్త డిపాజిట్లు తీసుకోకూడదని ఆంక్షలు పెట్టింది. 
 
అలాగే కస్టమర్లకు ఎలాంటి రుణాలు ఇవ్వకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ. అయితే బ్యాంక్ ప్రస్తుత లిక్విడిటీ పొజిషన్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది.