గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 23 జూన్ 2021 (16:34 IST)

‘ఇప్పుడు ప్రకాశించే సమయం వచ్చింది’ టీవీసిలో ఒలింపిక్‌ ఫెన్సర్‌ సి.ఎ. భవానీని వేడుక చేసిన రిన్‌

హిందుస్తాన్‌ యునిలీవర్‌ గ్రూప్‌కు చెందిన రిన్‌ డిటర్జెంట్‌ తమ తాజా ప్రచార కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకమైన సీ.ఏ. భవానీదేవి జీవితాన్ని  వేడుక చేస్తూ రూపొందించింది. టోక్యో ఒలింపిక్స్‌ 2021 కోసం అర్హత సాధించిన భారతదేశపు మొట్టమొదటి మహిళా ఫెన్సింగ్‌ చాంఫియన్‌ సీ.ఏ. భవానీ దేవి. గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన ఆమె, ఎవరికీ పెద్దగా తెలియని క్రీడ అయిన ఫెన్సింగ్‌ను ఎంచుకున్నారు. భవానీ కేవలం ఆర్థిక ఇబ్బందులను మాత్రమే ఎదుర్కోవడం కాదు, పితృస్వామ్య సమాజంలో మూస పద్ధతులను సైతం అధిగమించింది. భవానీ దేవి యొక్క హత్తుకునే ప్రయాణంపై ఈ టీవీసీ దృష్టి సారించడంతో పాటుగా ఆమె యొక్క క్రీడా కలలను సాకారం చేసుకునేందుకు పడిన కష్టమూ చూపింది.
 
భవానీ తన సంకల్పం, కష్టించే తత్త్వంతో తన నైపుణ్యాన్ని అతి తక్కువ మందికి తెలిసిన క్రీడలో పెంపొందించుకోవడమే కాదు, తనకు ఎదురైన సామాజిక సవాళ్లను సైతం అంతే ధైర్యంగా ఎదుర్కొన్నారు. రిన్‌ యొక్క ‘అబ్‌ వక్త్‌ హై చమక్‌ నే కా’ ప్రచారం, భవానీ యొక్క అకుంఠిత దీక్ష, ప్రజ్ఞ మరియు ఈ లక్ష్య సాధనలో ఆమెకు పూర్తి మద్దతునందించిన ఆమె తల్లి నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది. అసాధారణ తమ చర్యల ద్వారా ప్రపంచం తమను గమనించేలా చేసుకున్న సామాన్య ప్రజల పక్షాన ఎప్పుడూ నిలిచి ఉండే ఈ బ్రాండ్‌, లక్షలాది మందికి విజయ ప్రయాణంలో స్ఫూర్తినందిస్తుందన్న భావనలో భవానీ కథను పంచుకుంది.
 
ఒక నిమిషం పాటు జరిగే ఈ టీవీసీ, భవానీ ఓ చిన్నారిగా ఫెన్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తుండటంతో ఆరంభమవుతుంది. దానితో పాటుగా చిన్నతనం నుంచి విజయవంతమైన ఫెన్సర్‌గా మారడం వరకూ పితృస్వామ్య సమాజానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో తాను ఎదుర్కొన్న సవాళ్లను మననం చేసుకోవడమూ జరుగుతుంది. అతి పరిమితమైన సంపాదన కలిగిన  తన కుటుంబంలో ఆమెకు మొదటి ఫెన్సింగ్‌ కిట్‌ కొనుగోలు చేయడం తలకు మించిన భారం. ఆమె తల్లి ఆమెకు శిక్షణ అందించడం కోసం తన బంగారాన్ని తాకట్టుపెట్టడంతో పాటుగా కలలు కనడాన్ని ఎన్నడూ ఆపవద్దని ప్రోత్సహించారు.
 
ప్రతిరోజూ ఓ సవాల్‌గానే నిలిచింది. ఆమె ఇంటికి నీరసంగా చేరడంతో పాటుగా తన శిక్షణా సామాగ్రి కూడా పూర్తిగా మురికిగా మారిపోయేవి. అయినా సరే ఆమె ఎన్నడూ తన ప్రయత్నం వదులుకోలేదు. తరువాత రోజుకు పూర్తి సన్నద్ధతో ఉండేవారు. చివరికి, ఆమె కామన్‌వెల్త్‌ క్రీడలలో బంగారు పతకం సాధించారు మరియు తన తల్లి తనపై పెట్టుకున్న నమ్మకానికి నివాళిగా ఆ బంగారు పతకాన్ని భావిస్తూ, దానిని పట్టుకుని ‘దేఖో మా మై సోనా వాపసీ లే ఆయే (చూడమ్మా, నేను బంగారాన్ని వెనక్కి తీసుకువచ్చాను)’ అని అంటారు. ఈ బ్రాండ్‌, వస్త్రాలకు మాత్రమే కాదు, అభిరుచులు కలిగిన ప్రజల కోసం కూడా ఓ మహోన్నత కారణం ఆధారిత కథను సైతం తీసుకువచ్చి, తమ జీవితాలను అత్యుత్తమంగా మలుచుకోవడానికి, తమపై తాము అచంచల విశ్వాసం చూపుకోవడానికి, ఎలాంటి సౌకర్యాలు లేనప్పటికీ తమ ప్రయత్నం ఆరంభించి, విజయాన్ని సాధించేందుకు తోడ్పడే రీతిలో కథనం తీర్చిదిద్దారు.
 
ఈ ప్రచారం ఆరంభించడం గురించి ప్రభ నరసింహన్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అండ్‌ వీపీ- హోమ్‌ కేర్‌, హిందుస్తాన్‌ యునిలీవర్‌ లిమిటెడ్‌ మాట్లాడుతూ, ‘‘ఐదు దశాబ్దాలుగా ప్రతి భారతీయ గృహంలోనూ అంతర్భాగంగా రిన్‌ నిలువడంతో పాటుగా తామున్న స్థితి ఆధారంగా నిర్వచించబడటం కాకుండా, తమ సామాజిక ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా తమ కలలను సాకారం చేసుకోవడానికి ధైర్యం చూపుతున్న ప్రజల పక్షాన నిలుస్తుంది. వృద్ధిని కాంక్షించే, తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే వ్యక్తులు మరియు తమ అదృష్టాన్ని మార్చుకోవడానికి చూపే ధైర్యానికి మద్దతునందించడానికి ఈ బ్రాండ్‌ ప్రతీకగా నిలుస్తుంది.
 
మా తాజా ప్రచారం ‘అబ్‌ వక్త్‌ చమక్‌ నే కా’ ద్వారా మేము భవానీదేవి యొక్క అత్యద్భుతమైన ప్రయాణం, ఆమె తల్లి త్యాగాలు మరియు సమ్మిళిత విజయంతో పాటుగా ఈ ప్రయత్నంలో లక్షలాది మంది ఇతరులకు కష్టాలెదురైనా తమ కలలను సాకారం చేసుకోవడంలో స్ఫూర్తిని ప్రదర్శించాం. సామాన్యం నుంచి అసామాన్యంగా ఎదిగిన అలాంటి అసాధారణ స్టార్స్‌తో మా బ్రాండ్‌ మరింత ఉన్నతంగా మారుతుంది. భవానీ అంకిత భావానికి మేము వందనాలు తెలుపుతున్నాము మరియు 2021 ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు సిద్ధమవుతున్నభవానీ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాము’’ అని అన్నారు.