బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 జులై 2021 (10:28 IST)

బ్యాంకులను ముంచేస్తున్నారు... రూ.200 కోట్లు టోకరా.. నిందితుడి అరెస్ట్

crime
బ్యాంకులను ముంచే వ్యాపారవేత్తల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా బ్యాంకుల నుండి రూ.200 కోట్లు లోన్లు తీసుకొని టోకరా వేసిన నిందితుడిని సిసిఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఒడిశాకు చెందిన సంబంధ్‌ ఫిన్‌సర్వ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సిఇఒ, ఎండి దీపక్‌ కిండోను మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థల నుంచి లోన్లు తీసుకొని మోసాలకు పాల్పడ్డాడు.

నాబార్డ్‌కు దీపక్‌ రూ.5 కోట్లు కుచ్చుటోపి పెట్టాడు. దీపక్‌ కిండోపై తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కూడా పలు క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.
 
ఇదే విధంగా నాబార్డ్‌ అనుబంధ సంస్థ నాబ్‌ సమృద్ధి ఫైనాన్స్‌ లిమిటెడ్‌ నుంచి రూ.5 కోట్ల రుణం తీసుకున్నాడు. కొన్ని వాయిదాలు చెల్లించిన అనంతరం మిగతాడబ్బు చెల్లించకుండా ఎగవేశాడు. నాబార్డ్‌ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సిసిఎస్‌ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 
 
నాబ్‌ సమృద్ధి ఫైనాన్స్‌ లిమిటెడ్‌ అధికారి దీనిపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ పోలీసులు ఒడిశాలోని రాజంగ్‌పూర్‌లో ఉన్న నిందితుడు దీపక్‌ కిండోను అరెస్ట్‌ చేసి పీటీ వారెంట్‌పై నగరానికి తరలించారు.