ఎస్బీఐ బంపర్ ఆఫర్.. ఉచితంగానే ఐటీఆర్ దాఖలు చేయవచ్చు!
దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఇందులో భాగంగా ఉచిత ఆఫర్ ఒకదాన్ని అందుబాటులో ఉంచింది. దీనితో చాలా మందికి రిలీఫ్ కలుగనుంది. ముఖ్యంగా చెప్పాలంటే పన్ను చెల్లింపుదారులకు చక్కటి బెనిఫిట్ ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉచితంగానే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేసే అవకాశాన్ని ఇస్తోంది.
దీనితో పన్ను చెల్లింపుదారులు ఉచితంగానే ఐటీఆర్ దాఖలు చేయవచ్చు. ట్యాక్స్2విన్ ప్లాట్‌ఫామ్ ద్వారా యోనో కలిగిన వాళ్ళు ఈ ఫెసిలిటీని పొందొచ్చు. అలానే రూ.199కే సీఏ సర్వీసులు కూడా పొందొచ్చు.
దీని కోసం మొదట యోనో యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత షాప్ అండ్ ఆర్డర్ ఆప్షన్‌లోకి వెళ్లి.. ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత ట్యాక్స్2విన్ ఆప్షన్‌పై క్లిక్ చెయ్యాలి అంతే. ఇలా రిటర్న్స్ ఫైల్ చెయ్యచ్చు. జూలై 24న ఇన్‌కమ్ ట్యాక్స్ డే సందర్భంగా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది అని స్టేట్ బ్యాంక్ అంది