శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2021 (15:54 IST)

హాలీడే హోమ్స్‌ ప్రాజెక్ట్‌: సుష్మా ఎలిమెంటాను హిమాచల్‌ప్రదేశ్‌లో సుష్మా గ్రూప్‌ ఆవిష్కరణ

ప్రతిష్టాత్మకమైన 13 ప్రాజెక్ట్‌లను పూర్తి చేసిన ఘనమైన రికార్డు కలిగి ఉండటంతో పాటుగా పంజాబ్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ సుష్మా గ్రూప్‌ తమ మొట్టమొదటి సున్నితమైన నివాస ప్రాజెక్ట్‌ సుష్మా ఎలిమెంటాను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. సోలన్‌ జిల్లాలో అత్యంత అందమైన కొండ ప్రాంతం కసౌలీలో హాలీడే హోమ్స్‌కు అత్యంత అనువైన కేంద్రంగా ఈ ప్రాజెక్ట్‌ నిలువనుంది. ఈ ప్రాజెక్ట్‌ను 50 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. దీనికి నిధులను స్వయంగా సమకూర్చుకోనున్నారు.
 
దాదాపు 3,38,079 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్‌ మొత్తంమ్మీద 382 యూనిట్ల 1, 2 మరియు 3 బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌లను 630 చదరపు అడుగుల నుంచి 1335 చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 టవర్లలో అందిస్తుంది. సముద్ర మట్టానికి దాదాపు 6 వేల అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్‌లోని అపార్ట్‌మెంట్‌లన్నీ కూడా కొండ లోయలకు ఎదురుగా ఉండటం వల్ల ప్రతి రూమ్‌ నుంచి అత్యద్భుతమైన వీక్షణను పొందవచ్చు.
 
ఈ ప్రాజెక్ట్‌లో అన్ని అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయి. వీటితో పాటుగా రిక్రియేషనల్‌ కార్యకలాపాలు అయినటువంటి జిమ్‌, ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రం, లైబ్రరీ, కిడ్స్‌ రూమ్‌, మీడియా రూమ్‌, స్పా, గేమ్స్‌ రూమ్‌, నేచర్‌ డెక్‌, గ్రాండ్‌ ఎంట్రెన్స్‌ పెవిలియన్‌, సన్‌సెట్‌ ప్లాజా వంటివి ఉండటం వల్ల కొండల వెనుకకు వెళ్లే సూర్యాస్తమయం కూడా ఆస్వాదించవచ్చు. చండీఘడ్‌ ఎయిర్‌పోర్ట్‌, హైవేలకు ఈ ప్రాజెక్ట్‌ అద్భుతంగా అనుసంధానతను కలిగి ఉంది.
 
ఈ ప్రాజెక్ట్‌ గురించి ప్రతీక్‌ మిట్టల్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌- సుష్మా గ్రూప్‌ మాట్లాడుతూ, ‘‘హిమాచల్‌ ప్రదేశ్‌లో మా తొలి ప్రాజెక్ట్‌ ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. మా లీజర్‌ హోమ్స్‌ విభాగంలో వినూత్నమైన ప్రాజెక్ట్‌ ఎలిమెంటా. హాలీడే హోమ్స్‌ నేపథ్యం ఆధారంగా నిర్మితమవుతున్న మొదటి ప్రాజెక్ట్‌ కూడా ఇది. ప్రతి రోజూ వృద్ధి చెందుతున్న ఒత్తిడి నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్‌ ప్రజలకు విశ్రాంతిని అందించనుంది. ఎందుకంటే, ఇది పర్వతాల నడుమ ఉండటంతో పాటుగా నగర రద్దీ వాతావరణానికి దూరంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌ కాలుష్యరహిత, ఒత్తిడి లేని పర్యావరణాన్ని పునరుత్తేజం కోసం అందించనుంది’’ అని అన్నారు.