రూ.2 వేల నోటు ముద్రణ నిలిపివేసిన ఆర్బీఐ

గురువారం, 10 నవంబరు 2022 (14:29 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన మరో పెద్ద నోటు రూ.2 వేల నోటు. ఈ నోటును ఇపుడు ముద్రించండం లేదని భారత రిజర్వు బ్యాంకు తెలిపింది. ముఖ్యంగా గడిచిన రెండేళ్లలో ఈ నోటు ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ పై విధంగా సమాధానమిచ్చింది. 
 
గత 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు కొత్తగా 2వ వేల నోట్లు ప్రింట్ చేయడం లేదు. కొంతకాలంగా రూ.2 వేల నోటు చాలమణిలో కనిపించడం లేదు. ఏటీఎంలలో కూడా రూ.500, రూ.200, రూ.100 నోట్లు మాత్రమే వస్తున్నాయి. మార్కెట్‌లో రూ.2 వేల నోటు కనిపించడమే అరుదైపోయిందని పలువురు దకాణాదారులు చెబుతున్నారు.
 
మరోవైపు, రూ.2 వేల నోటు ముద్రించక పోవడానికి కేంద్రం గతంలో లోక్‌సభలో వివరణ కూడా ఇచ్చింది. పెద్ద నోట్ల ముద్రణ ఆపేయడం ద్వారా నల్లధనాన్ని అరికట్టవచ్చని, నకిలీ నోట్ల బెడద నుంచి తప్పించుకోవచ్చని తెలిపింది. 

అన్నీ చూడండి

'రామాయణం' చిత్రం కాదు.. భారత్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రయాణం : రకుల్ ప్రీత్ సింగ్

అవకాశాల కోసం దిగజారను : కాజల్ అగర్వాల్

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్న బ్రహ్మయుగం

New Delhi: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల ప్రకటన వెలువడింది

L.B. Sriram: ఆలస్యంగా గుర్తించినందుకు అవమానంగా ఉంది : ఎల్. బి. శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments