శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 7 ఏప్రియల్ 2021 (15:39 IST)

యుగెట్‌ 2021 కోసం కొమెడ్‌ కె-యుని గేజ్‌ ప్రవేశ పరీక్ష: దరఖాస్తుల తేదీల ప్రకటన

కొమెడ్‌కె యుగెట్‌ మరియు యుని-గేజ్‌ ప్రవేశ పరీక్ష జూన్‌ 30, 2021వ తేదీన ఉమ్మడి పరీక్షగా జరుగనుంది. ఈ ప్రవేశపరీక్షను కర్నాటక ప్రొఫెషనల్‌ కాలేజీస్‌ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ మరియు యుని-గేజ్‌ సభ్య యూనివర్శిటీలకు అనుబంధంగా ఉన్న కాలేజీలలో బీఈ/బీటెక్‌ ప్రవేశాల కోసం నిర్వహించనున్నారు. ఈ పరీక్షను భారతదేశంలోని 150 నగరాలలో ఆన్‌లైన్‌ విధానంలో 400కు పైగా పరీక్షా కేంద్రాల ద్వారా నిర్వహించనున్నారు. ఈ సంవత్సరం ఈ పరీక్షకు 80 వేల మందికి పైగా విద్యార్థులు హాజరవుతారని అంచనా.
 
దరఖాస్తుదారులు  comedk.org వద్ద లేదాunigauge.com వద్ద రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లో 22 మార్చి 2021 వ తేదీ నుంచి 20 మే 2021వ తేదీ వరకూ తెరిచి ఉంచబడుతుంది.
 
డాక్టర్‌ కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ సెక్రటరీ, కొమెడ్‌కె మాట్లాడుతూ, ‘‘ఇంజినీరింగ్‌ విద్యలో అగ్రగామిగా కర్నాటక నిలుస్తుంది మరియు దేశవ్యాప్తంగా ఎంతోమంది ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఎల్లప్పుడూ ఇది కేంద్రంగానే నిలుస్తుంటుంది. గత కొద్ది సంవత్సరాలుగా, కర్నాటక వెలుపల నుంచి ఈ ప్రవేశ పరీక్షకు హాజరవుతున్న విద్యార్ధుల సంఖ్య పెరుగుతుండటం చూస్తున్నాము. 2020లో  మహమ్మారి కారణంగా అడ్మిషన్‌లలో కాస్త తగ్గుదల కనిపించినప్పటికీ, ఈ సంవత్సరం మాత్రం నిబంధనలను కాస్త సడలించడం వల్ల విద్యార్థుల ఆసక్తి మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నాం’’ అని అన్నారు.
 
‘‘కొమెడ్‌ కె గత 15సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా సజావుగా ఈ పరీక్షలను నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం సైతం, మేము సురక్షితమైన రీతిలో పరీక్షలు మరియు ప్రవేశాలను నిర్వహించనున్నాం’’ అని డాక్టర్‌ కుమార్‌ వెల్లడించారు. ‘‘గత సంవత్సరం కోవిడ్‌ మహమ్మారి విజృంభించినప్పటికీ మేము పరీక్షలను 392 కేంద్రాలలో అన్ని భద్రతా మార్గదర్శకాలకు కట్టుబడి నిర్వహించాం. విద్యార్థులు జిల్లాల పరిధిని దాటడాన్ని నివారిస్తూ మేము పరీక్షా కేంద్రాల సంఖ్యను సైతం వృద్ధి చేశాం. ఈ పరీక్షలను రెండు షిఫ్టులలో  నిర్వహిస్తున్నాం. 2020లో దాదాపు 60వేల మంది విద్యార్థులను ఆకర్షించగలిగాం’’ అని పీ మురళీధర్‌, సీఈవో, ఎరా ఫౌండేషన్‌ అన్నారు.
 
ఆయనే మరింతగా వెల్లడిస్తూ, ‘‘ ఈ సంవత్సరం, మేము మా భద్రతా ప్రమాణాలను ఆధునీకరించాం. తద్వారా ప్రతి కేంద్రమూ పూర్తిగా శానిటైజ్‌ చేశామన్న భరోసా కల్పించడంతో పాటుగా భౌతిక దూర ప్రమాణాలకు భరోసానందిస్తూ కేవలం 50% సీటింగ్‌ మాత్రమే అనుమతిస్తున్నాం. పరీక్షా కేంద్రాల సంఖ్యను సైతం 392 నుంచి 400కు పైగా సెంటర్లకు 150 నగరాలలో  విస్తరించాం. తద్వారా విద్యార్థులు ప్రయాణించే సమయాన్ని సైతం తగ్గించాం. ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నాం. తొలి సెషన్‌ ఉదయం 9 గంటలకు ఆరంభమై 12 గంటలకు ముగిస్తే, రెండవ సెషన్‌ మధ్యాహ్నం 2గంటలకు ఆరంభమై 5 గంటలకు ముగుస్తుంది’’ అని అన్నారు.
 
కొమెడ్‌ కె-యుని-గేజ్‌ ఇప్పుడు భారతదేశంలో రెండవ అతిపెద్ద మల్టీ యూనివర్శిటీ  ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష. ఈ పరీక్ష స్కోర్‌ను 180కు పైగా ఇస్టిట్యూషన్లు, 30కు పైగా యూనివర్శిటీలు అంగీకరిస్తున్నాయి. ఇప్పుడు 150కు పైగా నగరాలు, 400కు పైగా పరీక్షా కేంద్రాలకు చేరువకావడం ద్వారా ఇది గత కొద్ది సంవత్సరాలుగా మరింతగా ఆదరణ పొందుతుంది.