ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (20:42 IST)

దేశంలో కరోనా ఉధృతి.. నీట్‌, పీజీ మెడికల్‌ పరీక్షలు వాయిదా

దేశంలో కరోనా ఉధృతి కారణంగా అన్ని పరీక్షలు వాయిదా పడుతున్నాయి. బుధవారం సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు చేసిన కేంద్రం సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసింది. తాజాగా నీట్‌, మెడికల్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్‌ 18న నీట్‌, పీజీ ఎగ్జామ్స్‌ జరగాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నీట్‌, పీజీ మెడికల్‌ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.
 
కోవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా, ఏప్రిల్ 18న నిర్వహించ తలపెట్టిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ - పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్‌ను వాయిదా వేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. ఈ పరీక్షను నిర్వహించే తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే సీబీఎస్ఈ, వివిధ రాష్ట్రాల విద్యా శాఖలు కొన్ని పరీక్షలను వాయిదా వేయడం లేదా రద్దు చేయడం జరిగిన సంగతి తెలిసిందే.