మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2022 (08:58 IST)

ప్రేమను నిరాకరించిందని రైలు కిందకు తోసి చంపేసిన ప్రేమోన్మాది

sandhya
చెన్నైలో దారుణం జరిగింది. తన ప్రేమను నిరాకరించిందన్న కసితో ఓ యువతిని రైలుకింద తోసి చంపేశాడో ఓ ప్రేమోన్మాది. ఈ ఘటన చెన్నై సెంట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఫ్లాట్‌ఫామ్‌పై ఆ యువతితో వాదులాడుతూనే ఉన్నట్టుండి వేగంగా వస్తున్న రైలు కింద తోసిసి పారిపోయాడు. దీంతో ఆ యువతిపై రైలు దూసుకెళ్లడంతో తల, శరీర భాగం రెండు వేర్వేరయ్యాయి. ఆ ప్రేమోన్మాది అక్కడ నుంచి పారిపోయాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
 
స్థానిక ఆదంబాక్కంకు చెందిన సంధ్య (20) అనే యువతి టీనగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇదే ప్రాంతానికి చెందిన సతీశ్ (23) ప్రేమిస్తున్నానంటూ గత కొన్ని రోజులుగా ఆమె వెంటపడున్నాడు. అయితే, అతని మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా, ప్రేమకు అంగీకరించలేదు. తన ప్రేమను నిరాకరించిన ఆమెపై సతీశ్ కోపం ఆగ్రహంతె రగిలిపోయాడు. 
 
ఈ క్రమంలో సంధ్య కళాశాలకు వెళ్లేందుకు సెయింట్ థామస్ మౌంట్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని రైలు కోసం ఎదురుచూస్తోంది. ఆసమయంలో అక్కడికి చేరుకున్న సతీశ్ తన ప్రేమ విషయంలో ఆమెతో అక్కడే వాదులాటకు దిగాడు. అయినప్పటికీ ఆమె ససేమిరా అనడంతో ఆగ్రహంతో ఊగిపోతూ ప్లాట్‌పామ్ నుంచి రైలు పట్టాలపైకి ఆమెను తోసేశాడు. 
 
సరిగ్గా ఆ సమయంలోనే తాంబరం నుంచి బీచ్ వైపు వెళుతున్న సబర్బన్ కింద పడిపోయింది. దీంతో సంధ్య తల, శరీరం వేర్వేరుగా రెండు ముక్కలైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.