శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. చైల్డ్ కేర్
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 21 డిశెంబరు 2018 (18:09 IST)

ఎదిగే పిల్లలు అలాంటి ఆహారానికి దూరంగా వుంచాలి...

సాధారణంగా ప్రస్తుతకాలంలో ఉన్న పిల్లలు స్నాక్స్ అంటే చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ముఖ్యంగా షాపులలో దొరికే పొటాటో చిప్స్ ప్యాకెట్స్‌ను ఎక్కవుగా తింటూ ఉంటారు. దీనిలో నిల్వ ఉండటానికి కలిపే రసాయనాలు ఎంతో హాని చేస్తాయి. వీటిని తరచూ తినడం వలన పిల్లలు అనారోగ్యానికి గురి అవుతారు. కనుక పిల్లలను ఆ ప్యాకెట్స్‌కు దూరంగా ఉంచాలి.
 
1. ముఖ్యంగా పిల్లలకు వారానికి 3 లేదా 4 సార్లు తెల్లనువ్వుల ఉండ, వేరుశనగ ఉండ, సున్నుండ లాంటివి ఖచ్చితంగా పెట్టాలి.
 
2. వారానికి రెండు లేదా మూడు సార్లు జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా లాంటివి స్నాక్స్ పెడుతూ ఉండాలి. వీటి వలన పిల్లలలో రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.
 
3. ఎక్కువ నూనెలతో చేసే పునుగులు, బజ్జీలు, సమోసాలు మెుదలైన వాటికి పిల్లలకు దూరంగా ఉంచాలి. మసాలాలు, వేపుడు పదార్ధాలకు పిల్లలను దూరంగా ఉంచాలి.
 
4. పిల్లల విషయంలో చక్కెర వాడకాన్ని బాగా తగ్గించాలి. బెల్లంతో తయారుచేసిన పదార్ధాలను మాత్రమే పిల్లలకు అలవాటు చేయాలి. 
 
5. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు 7 లేక 8 గంటలు నిద్ర అవసరం. దీనివలన వారిలో పెరుగుదల సక్రమంగా ఉంటుంది.
 
6. సాధ్యమైనంత వరకు పిల్లలను బయట దొరికే ఆహారపదార్ధాల నుండి దూరంగా ఉంచాలి. ఇలా చేయడం వలన పిల్లలకు మంచి 
ఆరోగ్యాన్ని ఇవ్వవచ్చు.