శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. కాంటినెంటల్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 మార్చి 2023 (12:34 IST)

పిల్లలకు నచ్చే బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలి..

Make Bread Pizza
Make Bread Pizza
పిల్లలకు నచ్చే బ్రెడ్ పిజ్జా ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలిసిన పదార్థాలు 
బ్రెడ్ - 4 ముక్కలు
టొమాటో కెచప్ - అవసరం మేరకు
ఉల్లిపాయ తరుగు - అరకప్పు 
టమోటో తరుగు -  అరకప్పు 
పచ్చి లేదా పసుపు మిరపకాయ తరుగు - ఒక స్పూన్ 
తురిమిన మొజారెల్లా చీజ్ - అవసరమైనంత 
ఒరేగానో - కొద్దిగా
ఉప్పు -  తగినంత 
మిరియాలు - రుచికి సరిపడా 
ఆలివ్ ఆయిల్ - రుచికి సరిపడా 
 
తయారీ విధానం :
ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయలు, టమాటాలు, మిరపకాయలు, ఒరిగానో, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బ్రెడ్ ముక్కలను తీసుకుని ముందుగా టోస్టర్ లేదా స్టోన్‌లో టోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాల్చిన బ్రెడ్ ముక్కలను తీసుకుని వాటిపై టమాటో కెచప్‌ను వేయాలి. తర్వాత ఒక చెంచా కూరగాయల మిశ్రమాన్ని దానిపై వేయాలి. ఆ తర్వాత వాటిపై కొద్దిగా తురిమిన చీజ్‌ను వేయాలి. తర్వాత బ్రెడ్ ముక్కను వేడి వేడి టోస్టర్ మీద వేసి మూతపెట్టి మీడియం మంట మీద 2 నిమిషాలు ఉంచి చీజ్ కరిగితే రుచికరమైన బ్రెడ్ పిజ్జా రెడీ.