నిమ్మచెక్కలను నీటిలో మరిగించి ఇలా చేస్తే..?

సోమవారం, 3 డిశెంబరు 2018 (10:50 IST)
నిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలామంది నిమ్మరసాన్ని మాత్రం వాడి వాటి తొక్కలను పారేస్తున్నారు. ఈ నిమ్మ తొక్కలోని ప్రయోజనాలు తెలుసుకుంటే.. మరోసారి ఇలా చేయాలనిపించదు. మరి అవేంటో ఓసారి పరిశీలిద్దాం...
 
1. సాధారణంగా ప్రతి ఇంట్లో ఫ్రిజ్ ఉంటుంది. కానీ, దానిని సరిగ్గా శుభ్రం చేయక దుర్వాసన వస్తుంటుంది. ఆ వాసన తొలగించాలంటే.. ఇలా చేయాలి. ఓ చిన్న కప్పులో నిమ్మకాయ ముక్క ఉంచి ఫ్రిజ్‌లో పెడితే తక్షణమే దుర్వాసన పోతుంది. 
 
2. కొందరు ఎప్పుడూ దోశలే ఎక్కువగా తింటున్నారు. కానీ, దోశలు పోసుకుని పెనంను సరిగ్గా శుభ్రం చేసుకోరు. అలా చేయకపోతే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని చెప్తున్నారు నిపుణులు. అందువలన పెనంపై కొద్దిగా ఉప్పు చల్లి చిన్న నిమ్మ చెక్కతో రుద్ది కడగాలి. ఆ తరువాత పొడి వస్త్రంతో తుడిస్తే పెనంపై గల నూనె మరకలు పోతాయి. 
 
3. ఇంట్లో పురుగులు, చీమలు, కీటకాలు ఎక్కువగా వస్తుంటే.. ఆ ప్రాంతాల్లో కొన్ని నిమ్మ చెక్కలను ఉంచితే చాలు... వాటి బాధ ఉండదు.
 
4. వంటింట్లో పాడైపోయిన కూరగాయలు, వంటల తాలూకు చెడు వాసన వస్తే.. గిన్నె నిండా నీరు నింపి అందులో నిమ్మ చెక్కలను వేసి మరిగించుకోవాలి. నీరు మరిగాక వాటి నుండి సువాసన వెదజల్లుతుంది. దాంతో ఇల్లంతా పరిమళభరితం అవుతుంది.
 
5. బాణలి, పొయ్యి వంటి వాటిల్లో నూనె మరకలు ఎక్కువగా ఉంటాయి. వాటిని తొలగించాలంటే.. నిమ్మ చెక్కలను ఉపయోగిస్తే.. ఫలితం ఉంటుంది.  

అన్నీ చూడండి

జూలై 22, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంది?

తెలిసినవారితో తెలుగు అమ్మాయిలు జాగ్రత్త, 80 శాతం లైంగిక దాడులకు వీళ్లే కారకులు, రిపోర్ట్

Rahul Gandhi: జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ.. ఎత్తుకెళ్లిన పోలీసులు

బ్రిటన్‌లో తొలి ఏఐ మంత్రిగా భారతీయుడు

Mysuru: భార్య, ఇద్దరు కుమార్తెల గొంతు నులిమి చంపేసిన భర్త

అన్నీ చూడండి

జియోస్టార్, భారతదేశ వ్యాప్తంగా ఆరు బిగ్ బాస్ ఎడిషన్లు ఒకేచోట

Prabhas: స్పిరిట్ పంపిణీ కోసం పీపుల్ మీడియా, ఏషియన్ సురేష్ భాగస్వామ్యం

Priyadarshi: ఈ కథ విన్నప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది : ప్రియదర్శి

Vijay: ఒకేలా బతకడానికి ఇంత పెద్ద జన్మ ఎందుకు? అనేది నాకు స్పూర్తి : వెంకట్ కె. నారాయణ

సోనమ్ రఘువంశీ ప్రవర్తనపై ప్రశ్నాస్త్రాలను సంధించిన సుప్రీం కోర్టు

తర్వాతి కథనం
Show comments