ఏపీలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో కొత్తగా 1160 కేసులు

corona virus
corona virus
సెల్వి| Last Updated: శనివారం, 21 నవంబరు 2020 (18:34 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1160 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 861092కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఏడుగురు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6,927 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,770 యాక్టివ్‌ కరోనా కేసులు న్నాయి.

ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,36,500 లక్షలకు చేరింది. ఇక శుక్రవారం ఒక్కరోజే ఏపీలో 68307 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 9543177 కరోనా పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

అలాగే జిల్లాల వారీగా చూస్తే అనంతపురంలో 43, చిత్తూరు 148, తూర్పుగోదావరి జిల్లాలో 165, గుంటూరు 121, కడపలో 70, కృష్ణాలో 189, కర్నూలులో 23, నెల్లూరు 60, ప్రకాశంలో 66, శ్రీకాకుళంలో 46, విశాఖపట్నంలో 67, విజయనగరంలో 42, పశ్చిమ గోదావరిలో 120 కేసులు నమోదయ్యాయి.దీనిపై మరింత చదవండి :