Dharma Sangrah

ఏపీలో కొత్తగా మరో 2050 పాజిటివ్ కేసులు

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 8 ఆగస్టు 2021 (18:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఓ బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ మేరకు గడచిన 24 గంటల్లో 85,283 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,050 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. 
 
అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 375 కొత్త కేసులు నమోదు కాగా, చిత్తూరు జిల్లాలో 324, నెల్లూరు జిల్లాలో 221, ప్రకాశం జిల్లాలో 212, గుంటూరు జిల్లాలో 209 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 23 కొత్త 
కేసులు నమోదయ్యాయి.
 
అదేసమయంలో 2,458 మంది కరోనా నుంచి కోలుకోగా, 18 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 13,531 మంది కరోనాతో కన్నుమూశారు. ఏపీలో ఇప్పటిదాకా 19,82,308 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,48,828 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 19,949 మంది చికిత్స పొందుతున్నారు.

అన్నీ చూడండి

Ibomma: ఓవర్ ది నైట్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసి ఐ బొమ్మ\ షూటింగ్ కంప్లీట్ చేశాం : డైరెక్టర్ విజయ్

జి.వి.ప్రకాష్ కుమార్ ఆవిష్కరించిన చకోర లోని ధమ్ ధమ్ సాంగ్

Ayush Tejas: శరత్ బాబు వారసుడు ఆయుష్ తేజస్ టాలీవుడ్ ఎంట్రీ

Sardar 2 Review: సర్దార్ 2 చిత్రం కార్తీ కి కలిసి రాలేదా? సర్దార్ 2 రివ్యూ

Udayabhanu: పంచనామాకు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా : ఉదయభాను ఎమోషనల్

తర్వాతి కథనం
Show comments